Animal Movie : సందీప్ రెడ్డి వంగా.! ‘అర్జున్ రెడ్డి డైరెక్టర్ ‘అక్కడే’ వుండిపోయాడా.?

NQ Staff - November 24, 2022 / 04:56 PM IST

Animal Movie : సందీప్ రెడ్డి వంగా.! ‘అర్జున్ రెడ్డి డైరెక్టర్ ‘అక్కడే’ వుండిపోయాడా.?

Animal Movie : ‘అర్జున్ రెడ్డి సినిమాతో ఎక్కడ లేని క్రేజ్ దక్కించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన ‘అర్జున్ రెడ్డి’ ఇటు విజయ్‌ని రాత్రికి రాత్రే సెన్సేషనల్ హీరోగా చేస్తే, అటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకీ అంత గొప్ప క్రేజ్ తెచ్చిపెట్టింది.

తెలుగులో తిరుగులేని సక్సెస్ అందుకున్న ఈ సినిమాని హిందీలోనూ ఆయనే రీమేక్ చేశాడు. అక్కడా ఆ సినిమా సూపర్ సక్సెస్. దాంతో, సందీప్ రెడ్డి వంగా ఇటు టాలీవుడ్‌లోనూ, అటు బాలీవుడ్‌లోనూ క్రేజీయెస్ట్ డైరెక్టర్ అయిపోయాడు.

సందీప్ రెడ్డి ప్లానింగ్ ఏంటో కానీ.!

కానీ, తెలుగులో సందీప్ మరో సినిమా చేయలేదింతవరకూ. బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్ తో ‘ఏనిమల్’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇంతవరకూ ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదు కానీ, తాజాగా రణ్‌బీర్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

‘అర్జున్ రెడ్డి’ హీరో మాదిరిగానే ఈ లుక్ వుండడంతో, ‘అర్జున్ రెడ్డి’ని సందీప్ రెడ్డి ఇంకా వదల్లేకపోతున్నాడా.? అంటూ కామెంట్లు వస్తున్నాయ్. రక్తం అంటిన చొక్కాతో చాలా సీరియస్ అండ్ రగ్గ్‌డ్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు రణ్‌బీర్ ఈ లుక్స్‌లో.

ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్న ఈ సినిమాలో రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, వచ్చే ఏడాది ఆగస్ట్‌లో ఈ సినిమాని రిలిజ్ చేసేందుకు సందీప్ రెడ్డి అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us