Rajamouli : రాజమౌళి కంటే ఆ తెలుగు డైరెక్టరే గొప్పోడు.. రానా ఇలా అన్నాడేంటి..?

NQ Staff - June 4, 2023 / 05:47 PM IST

Rajamouli : రాజమౌళి కంటే ఆ తెలుగు డైరెక్టరే గొప్పోడు.. రానా ఇలా అన్నాడేంటి..?

Rajamouli : తెలుగులో ఎవరు నెంబర్ వన్ డైరెక్టర్ అంటే అందరూ టక్కున చెప్పే పేరు రాజమౌళి. కేవలం తెలుగులోనే కాదు.. ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ అంటే కూడా టక్కున రాజమౌళి పేరు చెప్పేస్తారు. అలాంటి రాజమౌళి ఇప్పుడు తెలుగు సినిమాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ఆయన వల్లే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లు పుట్టుకు వస్తున్నారు.

అలాంటి రాజమౌళి కంటే తెలుగులో గొప్ప డైరెక్టర్ ఉన్నారా అంటే లేరనే అందరూ ఆన్సర్ ఇస్తారు. కానీ రానా మాత్రం రాజమౌళి కంటే గొప్ప డైరెక్టర్ మరొకరు ఉన్నారంటూ చెబుతున్నారు. రీసెంట్ గా ఆయన పరేషాన్ మూవీ కోసం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టు కే గ్లోబల్ సినిమాగా రాబోతోంది. ఈ సినిమా కచ్చితంగా త్రిబుల్ ఆర్, బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుంది. నాగ్ అశ్విన్ తెలుగులో అందరి కంటే చాలా ట్యలెంటెడ్ డైరెక్టర్ అంటూ కామెంట్లు చేశాడు రానా. ఈ కామెంట్లు ఒక రకంగా రాజమౌళి కంటే నాగ్ అశ్విన్ గొప్పోడు అనేలా ఉన్నాయని అంటున్నారు రాజమౌళి ఫ్యాన్స్.

ఇదే వారికి నచ్చట్లేదు. ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా సినిమా తీయలేని నాగ్ అశ్విన్ ఎలా గొప్పోడు అయ్యాడంటూ పోస్టులు పెడుతున్నారు. రాజమౌళి వల్లే నువ్వు పాన్ ఇండియా యాక్టర్ అయ్యావని మర్చిపోకు అంటూ రానాకు సలహాలు ఇస్తున్నారు. ఏదేమైనా రానా చేసిన కామెంట్లు దుమారమే రేపుతున్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us