Rana : పెళ్లి తర్వాత రానా ఏంటీ ప్లే బోయ్ వేషాలు.! ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.!

NQ Staff - September 26, 2022 / 07:07 AM IST

Rana : పెళ్లి తర్వాత రానా ఏంటీ ప్లే బోయ్ వేషాలు.! ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.!

Rana : దగ్గుబాటి హీరో రానా పెళ్లి తర్వాత మారిపోయాడా.? పెళ్లికి ముందు ఆన్ స్ర్కీన్ ఎప్పుడూ వేయని వేషాలు ఇప్పుడు వేస్తున్నాడా.? అసలింతకీ రానా ప్లే బోయ్ వేషాలేంటీ.? అంటే అసలు విషయం తెలియాల్సిందే.

తాజాగా రానా దగ్గుబాటి ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘రానా నాయుడు’ అనే ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్ అది. రానాతో పాటూ, బాబాయ్ వెంకటేష్ కూడా ఈ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఈ సంగతి ఎప్పుడో తెలుసు కానీ, తాజాగా ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన రిలీజ్ అయిన అప్‌డేట్ అదేనండీ, టీజర్ రానాని ట్రోల్స్‌కి గురి చేస్తోంది.

రానా లిప్‌లాక్ మరీ అంత ఘాటుగానా.?

ఈ టీజర్‌లో రానా ఓ అమ్మాయితో గాఢమైన లిప్ లాకులు లాగించేస్తున్నాడు. దాంతో రానా నెటిజన్స్‌కి టార్గెట్ అయిపోయాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రానా ఎందుకింత బరితెగించేశాడు.? అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

అయితే, ‘రానా నాయుడు’ అనేది ఓ వెబ్ సిరీస్. వెబ్ కంటెంట్ అన్నాకా కాస్త మసాలా వుండాల్సిందే. అందులోనూ బాలీవుడ్ వెబ్ సిరీసాయె. సో, తప్పదు. ఇకపోతే, ఈ టీజర్ రిలీజ్ అయిన నాటి నుంచీ వార్తల్లో హాట్ టాపిక్‌గానే నిలుస్తోంది. తండ్రీ కొడుకుల్లా నటిస్తున్నారు ఈ వెబ్ సిరీస్ కోసం వెంకీ, రానా.

వెంకీ లుక్స్‌లోనూ కాస్త పెప్ వుంది. సినిమాల్లో ఇంతవరకూ ట్రై చేయని కొత్త లుక్స్‌లో వెంకీ కనిపిస్తున్నాడు ఈ వెబ్ సిరీస్ కోసం. త్వరలోనే ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ర్టీమింగ్ కానుంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us