Naresh And Ramya : మైసూర్‌కి చేరిన న‌రేష్‌- ప‌విత్ర పంచాయతీ.. చెప్పుతో కొట్టేందుకు ప్ర‌య‌త్నించిన ర‌మ్య‌

NQ Staff - July 3, 2022 / 02:09 PM IST

Naresh And Ramya  : మైసూర్‌కి చేరిన న‌రేష్‌- ప‌విత్ర పంచాయతీ.. చెప్పుతో కొట్టేందుకు ప్ర‌య‌త్నించిన ర‌మ్య‌

Naresh And Ramya  : గ‌త కొద్ది రోజులుగా న‌రేష్‌, ప‌విత్రా లోకేష్‌, ర‌మ్య పంచాయ‌తీ తెగ హాట్ టాపిక్ గా మారుతుంది. న‌రేష్‌, ప‌విత్రాల‌పై ర‌మ్య ర‌ఘుప‌తి విమ‌ర్శ‌లు చేస్తుండ‌గా, ర‌మ్య త‌ప్పుడు కామెంట్స్ చేస్తుంద‌ని న‌రేష్- ప‌విత్రా ఖండిస్తూ వ‌స్తున్నారు. ర‌మ్య ర‌ఘుప‌తి.. సీనియ‌ర్ న‌రేష్‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌కు న‌రేష్ విడాకుల నోటీసులు పంపారని, అయితే తాను న‌రేష్‌కు తాను విడాకులు ఇచ్చే ప్ర‌స‌క్తి లేద‌ని ఆమె తెలిపారు.

చెప్పుతో దాడి..

బెంగుళూరులో ఉంటున్న ర‌మ్య ర‌ఘ‌ప‌తి .. న‌రేష్‌పై చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. న‌రేష్ టేబుల్‌పై గ‌న్ పెట్టి బెదిరించార‌ని ఈ సంద‌ర్భంగా ర‌మ్య తెలిపారు. వాటిని న‌రేష్ ఖండించారు. తాజాగా మైసూరులో అనూహ్య ఘ‌ట‌న ఎదురైంది. న‌రేష్‌- ప‌విత్రా క‌లిసి వెళుతుండ‌గా.. వీరిపై న‌రేశ్ భార్య రమ్య దాడి చేసేందుకు య‌త్నించింది. ప‌విత్రా లోకేశ్‌పై ఏకంగా చెప్పు తీసుకుని ఆమె దాడి చేసేందుకు య‌త్నించింది.

Ramya Tried to Slap Naresh

Ramya Tried to Slap Naresh

అయితే న‌రేశ్, ప‌విత్రా లోకేశ్‌ల‌కు సెక్యూరిటీగా వ‌చ్చిన పోలీసులు ర‌మ్య‌ను అడ్డుకున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు ప‌లు న్యూస్ ఛానెళ్ల‌లో వైర‌ల్‌గా మారిపోయాయి. త‌మ‌పై దాడి చేసేందుకు య‌త్నించిన ర‌మ్య‌ను మ‌రింత‌గా ఉడికించేందుకు న‌రేశ్ యత్నించాడు. ర‌మ్య‌ను చూసి విజిల్ వేస్తూ ఆయ‌న వెళ్లిపోయాడు. అంతేకాకుండా చేయి ఊపుతూ, ర‌మ్య గురించి కామెంట్ చేస్తూ వెళ్లిపోయాడు.

న‌రేశ్‌కు అప్ప‌టికే రెండు పెళ్లిళ్లు కాగా… ర‌మ్య ఆయ‌న‌కు మూడో భార్య‌. ర‌మ్య‌తో చాలా కాలంగా దూరంగానే ఉంటున్న న‌రేశ్… తాజాగా ప‌విత్రా లోకేశ్‌తో స‌న్నిహితంగా ఉంటున్నాడు. వీరి బంధంపై పెద్ద ఎత్తున పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఇటీవ‌లే స్పందించిన న‌రేశ్ త‌మ మ‌ధ్య స్నేహం మాత్ర‌మే ఉందంటూ వ్యాఖ్యానించాడు.

ప‌విత్రా లోకేశ్ మాత్రం న‌రేశ్‌కు ఆత్మీయ తోడు అవ‌స‌ర‌మ‌ని, కొంత‌కాలంగా అత‌డికి మానసికంగా అండ‌గా నిలుస్తున్నాన‌ని ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌క‌ట‌న‌ల నేప‌థ్యంలోనే ర‌మ్య వీరిద్ద‌రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే వారిపై దాడికి య‌త్నించింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us