Ramya Raghupathi : డబ్బుకోసమే పవిత్ర నా మొగుడ్ని వలలో వేసుకుంది: నరేష్ భార్య రమ్య.!

NQ Staff - July 3, 2022 / 05:41 PM IST

Ramya Raghupathi : డబ్బుకోసమే పవిత్ర నా మొగుడ్ని వలలో వేసుకుంది: నరేష్ భార్య రమ్య.!

Ramya Raghupathi : ‘నా భర్త నరేష్‌ని డబ్బు కోసమే పవిత్ర తెలివిగా వలలో వేసుకుంది.. ఆమె చాలామందిని ఇలాగే మోసం చేసింది. చాలా కాపురాల్లో చిచ్చు పెట్టింది..’ అంటూ సినీ నటి పవిత్ర లోకేష్ మీద సంచలన ఆరోపణలు చేశారు సీనియర్ నటుడు నరేష్ సతీమణి రమ్య రఘుపతి.

గత కొద్ది రోజులుగా రమ్య రఘుపతి – నరేష్ – పవిత్ర లోకేష్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా నరేష్ – పవిత్ర లోకేష్ సహ జీవనం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రమ్య రఘుపతిని వదిలించుకోవడానికి ఆమెపై నరేష్ చాలా ఆరోపణలు చేస్తున్నారు కూడా.

డ్రైవర్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందా.?

Ramya Raghupathi Reveals True Facts About Naresh

Ramya Raghupathi Reveals True Facts About Naresh

డ్రైవరుతో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందంటూ నరేష్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. అయితే, రమ్య రఘుపతి మాత్రం, నరేష్‌ని వదిలి పెట్టడంలేదు. మైసూరులోని ఓ హోటల్‌లో ఒకే గదిలో నరేష్, పవిత్ర లోకేష్ వుండడాన్ని పసిగట్టిన రమ్య రఘుపతి, తన బంధువులతో కలిసి అక్కడకు వెళ్ళారు.

పవిత్రను చెప్పుతో కొట్టేందుకూ రఘుపతి ప్రయత్నించగా, నరేష్ వెకిలిగా నవ్వాడు. నరేష్, పవిత్రకు రక్షణ కల్పించారు కొందరు. ఇదిలా వుంటే, తన భర్త తనకు కావాలనీ, తన అత్తగారు విజయనిర్మల జీవించి వుంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదని రమ్య వాపోతున్నారు.
మొత్తమ్మీద, నరేష్ – రమ్య రఘుపతి – పవిత్ర లోకేష్ వివాదం రోజు రోజుకీ మరింత ముదిరి పాకాన పడుతోంది. అత్యంత జుగుప్సాకరంగా తయారైంది కూడా.

 

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us