Ramya Krishna : నాలుగు నెలల గర్భంతో ఎన్టీఆర్ తో మాస్ బీట్ కి డాన్స్ చేసిందట

NQ Staff - October 7, 2022 / 10:32 AM IST

Ramya Krishna : నాలుగు నెలల గర్భంతో ఎన్టీఆర్ తో మాస్ బీట్ కి డాన్స్ చేసిందట

Ramya Krishna : సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒకప్పుడు ఎంత బిజీగా ఉందో ఇప్పుడు అంతకంటే ఎక్కువ బిజీగానే ఉంది అనడంలో సందేహం లేదు. ఒకప్పుడు చిరంజీవి నాగార్జున తో పాటు ఇంకా ఎంతో మంది స్టార్ హీరోలతో పెద్ద పెద్ద సినిమాల్లో నటించిన రమ్యకృష్ణ ఇప్పుడు స్టార్ హీరోల యొక్క సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న విషయం తెలిసిందే.

అంతే కాకుండా పలు రియాల్టీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న డాన్స్ ఐకాన్ షో కి రమ్యకృష్ణ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఒక కంటెస్టెంట్ నా అల్లుడు సినిమాలోని సయ్యా సయ్యారే అనే పాటకు డాన్స్ చేశారు.

ఆ పాటకి పెర్ఫార్మెన్స్ పూర్తయిన తర్వాత రమ్యకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ గారితో ఆ పాట లో మాస్టెప్స్ వేయడం జరిగింది. ఆ సమయంలో నేను నాలుగు నెలల గర్భవతిని అంటూ రమ్యకృష్ణ ఆశ్చర్యకర విషయంను ఎన్ని సంవత్సరాల తర్వాత తెలియజేశారు.

ఒక ప్రెగ్నెంట్ లేడీ డాన్స్ చేయడం.. అది కూడా ఎన్టీఆర్ వంటి మాస్ హీరో తో డాన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది కేవలం రమ్యకృష్ణ మాత్రమే చెల్లుబాటు అయింది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ తో సింహాద్రి సినిమాలో కూడా రమ్యకృష్ణ ఐటమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ తరం హీరోలకు జోడిగా డాన్స్ చేసే అరుదైన దక్కించుకున్న పోయిన తరం హీరోయిన్ రమ్యకృష్ణ మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us