Ramcharan : రామ్ చరణ్‌ ను నటుడిగా నిలబెట్టిన డైరెక్టర్ ఎవరో తెలుసా.. రాజమౌళి కాదు..!

NQ Staff - June 5, 2023 / 01:52 PM IST

Ramcharan : రామ్ చరణ్‌ ను నటుడిగా నిలబెట్టిన డైరెక్టర్ ఎవరో తెలుసా.. రాజమౌళి కాదు..!

Ramcharan  : రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అని అందరికీ తెలుసు. పైగా ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాతో ఆయన రేంజ్ మరో లెవల్ కు వెళ్తుందని అనుకుంటున్నారు. అయితే నేడు రామ్ చరణ్ అంటే గ్లోబల్ స్టార్ అనేంతగా ఎదిగిన ఈయన.. ఒకప్పుడు మాత్రం నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఇబ్బందులు పడ్డాడు.

అవును.. నాయక్ సినిమా తర్వాత ఆయనకు హిట్లు తగ్గాయి. వరుసగా ప్లాపులు చవిచూశారు. బ్రూస్ లీ సినిమా సమయంలో అయితే రామ్ చరణ్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కున్నారు. పేరుకే మెగాస్టార్ కొడుకు కానీ.. కనీసం నటన కూడా రాదు అంటూ ఆయన్ను ఎంతో మంది విమర్శించారు. దాంతో తాను మంచి నటుడిని అని గుర్తింపు తెచ్చుకోవాలని రామ్ చరణ్‌ డిసైడ్ అయ్యాడు.

Ramcharan Became Global Star

Ramcharan Became Global Star

ఆ సమయంలోనే ఆయనకు కనిపించిన ఒకే ఒక్క ఆప్షన్ సుకుమార్. సుకుమార్ సినిమాలో నటిస్తే కచ్చితంగా నటుడిగా నిలదొక్కుకోవచ్చు అని రామ్ చరణ్‌ నమ్మాడు. సుకుమార్ కోసం దాదాపు రెండేండ్లు కేటాయించాడు. రామ్ చరణ్‌ ను నటుడిగా నిలబెట్టడం కోసం సుకుమార్ కూడా చాలా టఫ్‌ క్యారెక్టర్ రాసుకున్నాడు.

అది కూడా ఒక చెవిటి వ్యక్తిగా రామ్ చరణ్‌ తో యాక్టింగ్ చేయించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్‌ యాక్టింగ్ కు ఫిదా కాని వారంటూ లేరు. అసలు మనకు ఎక్కడా రామ్ చరణ్‌ కనిపించడు. కేవలం చిట్టిబాబు మాత్రమే కనిపిస్తాడు. అంతగా పాత్రలో లీనమైపోయాడు రామ్ చరణ్‌. అందుకే ఈ సినిమా చరణ్‌ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయింది.

చరణ్‌ ఆశించినట్టే ఆయన్ను గొప్ప నటుడిగా నిలబెట్టింది. అంతకుముందు నటన రాదు అని తిట్టిన వారే.. రామ్ చరణ్‌ తండ్రి కంటే గొప్ప నటుడు అని మెచ్చుకున్నారు. దటీజ్ సుకుమార్.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us