Rashmi Goutam : జబర్దస్త్‌ రష్మీ గౌతమ్ ను పో$ర్న్‌ స్టార్ తో పోల్చి అవమానం

NQ Staff - December 30, 2022 / 08:20 AM IST

Rashmi Goutam : జబర్దస్త్‌ రష్మీ గౌతమ్ ను పో$ర్న్‌ స్టార్ తో పోల్చి అవమానం

Rashmi Goutam : జబర్దస్త్‌ తో తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను సుదీర్ఘ కాలంగా ఎంటర్‌ టైన్ చేస్తున్న ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్‌. ఈ అమ్మడు హీరోయిన్ గా కూడా నటించింది. హీరోయిన్ పీస్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉంటారు. బుల్లి తెరపై చేస్తుంది కనుక స్టార్‌ హీరోలు ఈమెను పట్టించుకోవడం లేదు.. కానీ రష్మీ కచ్చితంగా ఒక మంచి హీరోయిన్ పీచర్స్ ఉన్న అమ్మాయి అనేది చాలా మంది మాట.

తెలుగు ఒకప్పుడు కష్టంగా మాట్లాడిన రష్మీ గౌతమ్ ఇప్పుడు అనర్గలంగా మాట్లాడేస్తూ ఉంది. అందమైన రష్మీ గౌతమ్‌ పై జబర్దస్త్‌ కమెడియన్స్ దారుణమైన పంచ్‌ లు వేస్తూ ఆమెను అవమానిస్తూ ఉంటుంది. ప్రేక్షకులను నవ్వించేందుకు.. షో లు నడిచేందుకు తనపై పంచ్ లను లైట్ తీసుకుంటూ రష్మీ గౌతమ్ ముందుకు వెళ్తుంది.

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్‌ లో కూడా రష్మీ ని ఆటో రామ్‌ ప్రసాద్‌ ఏకంగా పో$ర్న్‌ స్టార్ మియా ఖలీఫా తో పోల్చాడు. ఆ సమయంలో రష్మీ మొహం లో రంగులు మారాయి. కానీ ఏం చేయలేక నవ్వి ఊరుకుంది. ఆ తర్వాత అలాంటి పంచ్ లకు రామ్‌ ప్రసాద్‌ పై సీరియస్ అయ్యి ఉంటుంది.

వచ్చే వారం శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క ఎపిసోడ్‌ లో భాగంగా చిన్న పిల్లల మాదిరిగా అంతా నటించాల్సి ఉంది. ఆ సమయంలో రష్మీ గౌతమ్ స్కూల్‌ యూనిఫామ్‌ వేసుకుని కళ్లద్దాలు పెట్టుకుని ఉంది. అప్పుడు ఇమాన్యూల్‌ ఈమెను ఎక్కడో చూసినట్లు ఉంది కదా అంటే రామ్‌ ప్రసాద్‌ కల్పించుకుని మియా ఖలీఫా రా అంటూ పంచ్ వేశాడు.

ఇలాంటి పంచ్ లు.. అవమానాలు రష్మి గౌతమ్ చాలా చూసింది. ఐనా కూడా షో కోసం, ప్రేక్షకుల కోసం అన్నట్లుగా ఈ అమ్మడు కంటిన్యూ అవుతోంది. ఆమె సైలెంట్ గా ఉన్నంత మాత్రాన ఎలా పడితే అలా ఆమెను కౌంటర్‌ చేయడం.. కామెంట్స్ చేయడం.. పంచ్ లు వేయడం సబబు కాదని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us