The Warrior : ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, తన తాజా సినిమా ‘ది వారియర్’ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాడు. ఏ హీరో అయినా, హీరోయిన్ అయినా, దర్శకుడు, నిర్మాత అయినా తమ సినిమా మీద కాన్ఫిడెంట్‌గా వుండకుండా వుంటారా.? అయితే, రామ్ పోతినేని రూటు కాస్త సెపరేటు.!
ప్రతి సినిమా విషయంలోనూ చాలా కాన్ఫిడెంట్‌గానే వుంటాడుగానీ, ఈసారి డబుల్ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు రామ్ పోతినేని. లింగు స్వామి దర్శకత్వంలో రూపొందిన ‘ది వారియర్’ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.
తెలుగుతోపాటు తమిళంలో కూడా..
‘ది వారియర్’ సినిమాని తెలుగుతోపాటు, తమిళ నేటివిటీకి దగ్గరగా వుండేలా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ‘బుల్లెట్టు..’ సాంగ్, తెలుగులో కంటే ఇతర భాషల్లో ఎక్కువ ప్రభంజనం సృష్టస్తోంది.

అన్నట్టు, ‘ది వారియర్’ సినిమాని రామ్ పోతినేని సొంతంగా రిలీజ్ చేయబోతున్నాడట. అదీ వైజాగ్ ఏరియా హక్కుల్ని ఆయనే తీసుకున్నాడట. ఈ విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఎంత గట్టి నమ్మకం వుంటే రామ్ పోతినేని ఇంత రిస్క్ తీసుకుని వుంటాడంటూ సినీ జనాలు చర్చించుకుంటున్నారు.
- Advertisement -
హీరోలు ఇలా తమ సినిమాల మీద పెట్టుబడులు పెట్టడమో, ఆయా సినిమాల హక్కులు తీసుకోవడమో కొత్తేమీ కాదు. కాకపోతే, రామ్ పోతినేని ఈ టైమ్‌లో ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నాడన్నదే ఆసక్తికరమైన విషయం. పోలీస్ అధికారిగా ఈ ‘ది వారియర్’ సినిమాలో రామ్ పోతినేని నటిస్తున్న సంగతి తెలిసిందే.
40 కోట్ల వరకు ‘ది వారియర్’ ప్రీ రిలీజ్ బిజినెస్ (థియేట్రికల్) జరిగినట్లు తెలుస్తోంది.