Ram Pothineni : యువ హీరో రామ్ విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో మాస్ హీరోగా మారిన రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ అనే సినిమా చేస్తున్నాడు. రామ్ అంటే కేవలం లవ్ స్టోరీ సినిమాలతోనే సక్సెస్ అందుకునే హీరో అనే ఒక ముద్రను కూడా చేరిపేశాడు. ఇక తదుపరి సినిమాలతో కూడా రామ్ బాక్సాఫీస్ వద్ద విభిన్నమైన స్థాయిలో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.
సారీ చెప్పాడుగా..
ప్రస్తుతం అందరి ఫోకస్ కూడా ది వారియర్ సినిమా పైనే ఉంది. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ పోతినేని ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కూడా సినిమాపై అంచనాల స్థాయిని పెంచేసింది.
రామ్ కెరీర్ లో ఫస్ట్ పోలీస్ డ్రామాగా ఫుల్ మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ది వారియర్ చిత్రం నుంచి లేటెస్ట్ గా మరో సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంలో మేకర్స్ ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అయితే ఇదిలా ఉండగా తాజాగా తన డైరెక్టర్ కి మాత్రం రామ్ క్షమాపణలు చెప్పడం ఆసక్తిగా మారింది.

అసలు మెయిన్ మ్యాన్ గురించి చెప్పడం నేను మర్చిపోయానని నా వారియర్, దర్శకుడు నా చిత్రాన్ని మొదటి నుంచి తన భుజాలపై ఉంచి మోసిన లింగుసామి సార్ మీరు నేను వర్క్ చేసిన బెస్ట్ దర్శకుల్లో మీరు కూడా ఒకరు. దయచేసి క్షమించండి అంటూ ట్వీట్ చేసాడు. అయితే నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో రామ్ లింగుసామి కోసం ఆ కంగారులో మాట్లాడలేదు దానికి సోషల్ మీడియాలో క్షమాపణ కోరాడు.
- Advertisement -
ఈ సినిమాను తమిళంలో కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ది వారియర్ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుంది అని రామ్ పోతినేని ఒక ఏరియా హక్కులను కూడా సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో ది వారియర్ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక రామ్ వైజాగ్ ఏరియా హక్కులను సొంతం చేసుకొని భారీగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.