Ram Gopal Varma Vyuham Movie Teaser : ఆర్జీవీ వ్యూహం టీజర్ వచ్చేసింది.. జగన్ రాజకీయ జీవితమే హైలెట్ గా..!

NQ Staff - June 24, 2023 / 11:30 AM IST

Ram Gopal Varma Vyuham Movie Teaser : ఆర్జీవీ వ్యూహం టీజర్ వచ్చేసింది.. జగన్ రాజకీయ జీవితమే హైలెట్ గా..!

Ram Gopal Varma Vyuham Movie Teaser : ఆర్జీవీ తీస్తున్న సినిమాలు అన్నీ కాంట్రవర్సీలే. కాకపోతే ఆయన ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను ఆధారంగా చేసుకుని సినిమాలు తీస్తున్నారు ఈ నడుమ. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్‌, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమాలతో పొలిటికల్ టచ్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి వ్యూహం సినిమాతో ఏపీ రాజకీయాలను హీటెక్కించారు.

ఆయన తెరకెక్కిస్తున్న వ్యూహం సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అయింది. ఈ సినిమాను జగన్ రాజకీయ జీవితం ఆధారంగా తీస్తున్నారు. టీజర్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పటి నుంచి ఇప్పుడు సీఎం అయ్యే వరకు జగన్ ప్రయాణం ఎలా సాగింది అనే కోణంలో టీజర్ ను వదిలారు. ఇందులో చంద్రబాబును నెగెటివ్ గానే చూపించారు.

టీజర్ లో ఒక్క డైలాగ్ కూడా లేదు. కేవలం సీన్లలను మాత్రమే చూపించాడు ఆర్జీవీ. జగన్ పై సీబీఐ కేసులు, చంద్రబాబు కుట్రలు ఇలా అన్నింటినీ టచ్ చేసేశాడు. ఒక రకంగా ఇది జగన్ సినిమా అనే చెప్పుకోవాలి. భారతి క్యారెక్టర్ ను కూడా హైలెట్ చేశాడు ఆర్జీవీ. అలా ఆలోచించడానికి నేను చంద్రబాబును కాదు అనే డైలాగ్ ను చివరలో వదిలాడు.

Ram Gopal Varma Vyuham Movie Teaser

Ram Gopal Varma Vyuham Movie Teaser

దాంతో మరోసారి చంద్రబాబును టార్గెట్ చేస్తున్నట్టు అర్థం అవుతోంది. జగన్ ను కేసుల్లో ఇరికించింది చంద్రబాబే అన్నట్టు టీజర్ లో క్లూస్ వదిలాడు. ఇది ప్రస్తుత రాజకీయాలను అనుగుణంగా చేసుకుని తెరకెక్కించారు. ఎలక్షన్ల ముందు ఇలాంటి సినిమాను రిలీజ్ చేయడం ఒక రకంగా టీడీపీకి మైనస్ అనే చెప్పుకోవాలి.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us