Ram Gopal Varma : ఆర్జీవీ.! చిరంజీవి అంటే ఇష్టం.! చిరంజీవి సినిమాలంటే ఇష్టం లేదు.!

NQ Staff - October 12, 2022 / 07:00 PM IST

Ram Gopal Varma : ఆర్జీవీ.! చిరంజీవి అంటే ఇష్టం.! చిరంజీవి సినిమాలంటే ఇష్టం లేదు.!

Ram Gopal Varma : కాంట్రవర్సీలకు కేరాప్ అడ్రస్‌గా వుండే రామ్ గోపాల్ వర్మ, తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి అంటే ఇష్టం కానీ, ఆయన సినిమాలు నాకు ఇష్టం లేదు.. అని స్టేట్‌మెంట్ ఇచ్చారు.

గరికపాటి వెర్సస్ చిరంజీవి ఇష్యూ ఈ మధ్య పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో మెగాస్టార్‌కి తాను వీరాభిమానిని అని ప్రకటించుకుంటూ వీర లెవల్లో ట్వీటులు మీద ట్వీటులు పీకారు రామ్ గోపాల్ వర్మ. మెగా ఫ్యామిలీ అంటేనే కస్సు బుస్సులాడే వర్మ, సడెన్‌గా చిరంజీవి గురించి ఇలా మాట్లాడేసరికి, ఎలా రెస్సాండ్ అవ్వాలో తెలియలేదు మెగా అభిమానులకి.

ఇదో కొత్త పబ్లిసిటీ స్టంట్.!

ఆ సంగతి అలా వుంటే, తాజాగా మరోసారి వర్మగారు తెరపైకి వచ్చారు. ఈ సారి ఇంకో కన్ఫ్యూజింగ్ కాంట్రవర్సీ. చిరంజీవి అంటే ఇష్టం కానీ, ఆయన సినిమాలంటే ఇష్టం లేదు. ఆయన సినిమాలు నేను చూడను.. అని చెప్పారు.

రీసెంట్‌గా చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా చూశారా.? అని అడిగితే, నేను చూడలేదు.. అని చెప్పే సందర్భంలో ఆయన పై విధంగా రెస్పాండ్ అయ్యారు.

అభిమాని అయితే, ఆయన సినిమాలు చూడకుండా ఎలా వుంటారు.? అని నెటిజన్లు వర్మను ఎప్పటిలాగే ఆటాడేసుకుంటున్నారు. ఇక, ప్రస్తుతం వర్మగారు ‘అడవి’ అనే ఓ సినిమా తెరకెక్కించారు. ఆ సినిమా ప్రమోషన్స్ నిమిత్తమే ఇదిగో మెగాస్టార్ చిరంజీవిని అడ్డం పెట్టుకుని ఇలా పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారనుకోవాలేమో.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us