Ram Gopal Varma : సంచలనం.. రాజమౌళి హత్యకు కుట్ర.. ఆ దర్శకులు పెద్ద కుట్ర చేశారుగా..!

NQ Staff - January 24, 2023 / 12:27 PM IST

Ram Gopal Varma : సంచలనం.. రాజమౌళి హత్యకు కుట్ర.. ఆ దర్శకులు పెద్ద కుట్ర చేశారుగా..!

Ram Gopal Varma : డైరెక్టర్‌ రాజమౌళి పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది. ముఖ్యంగా త్రిబుల్‌ ఆర్‌ సినిమా వచ్చినప్పటి నుంచి ఆయన పేరు మార్మోగిపోతోంది. ఈ సినిమాకు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు వచ్చాయి. దాంతో జక్కన్న వరల్డ్‌ ఫేమస్‌ డైరెక్టర్‌ అయిపోయాడు. అయితే జక్కన్నకు వ్యక్తిగతంగా ఎవరూ శత్రువులు లేరు.

అయితే తాజాగా వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. రామ్ గోపాల్‌ వర్మ తాజాగా వరుస ట్వీట్స్‌చేశారు. ఇందులో ఆయన రాసుకొస్తూ.. ” రాజమౌళి సార్ మీ భద్రతను మరింత పటిష్టంగా మార్చుకోండి. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని కొందరు ఇండియన్ డైరెక్టర్స్ ఒక గ్రూప్ గా మారి మిమ్మల్ని చంపాలి అనుకుంటున్నారు.

ఆర్జీవీ ట్వీట్లు..

 

ఆ గ్రూప్ సభ్యుల్లో నేను కూడా ఒకడిని. మందు కిక్కులో ఈ కుట్ర గురించి నేను చెప్పేశాను” అని ట్వీట్‌ చేశారు. అంటే దర్శకుడు ఆర్జీవీ ఉద్దేశం వేరే ఉంది. రీసెంట్ గా రాజమౌళిని హాలీవుడ్ మీడియా బాగా పొగుడుతోంది. జేమ్స్‌ కామెరూన్ లాంటి వారు కూడా పొగుడుతున్నారు. దాంతో రాజమౌళి క్రేజ్ అమాంతం హాలీవుడ్‌ రేంజ్‌కు ఎదిగిపోయింది.

కాబట్టి ఆయన ఎదుగుదలను చాలామంది ఇండియన్‌ దర్శకులు ఓర్వలేకపోతున్నారని ఇన్‌ డైరెక్టుగా ఆర్జీవీ చెప్పుకొచ్చాడన్నమాట. ఆర్జీవీ చెప్పిన దాంట్లో చాలా వరకు నిజం ఉంది. ఎందుకంటే రాజమౌళి తీసే సినిమాలను మన పక్కనున్న కోలీవుడ్‌ కూడా విమర్శించింది. ఎన్నో సార్లు ట్రోల్స్‌ చేసింది కోలీవుడ్‌ మీడియా.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us