Ram gopal varma: నానికి కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేస్తూనే త‌న‌దైన శైలిలో పంచ్‌లు వేసిన వ‌ర్మ‌

Ram gopal varma: ఏపీ సినిమా టిక్కెట్ల వ్య‌వ‌హారంలో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ త‌న‌దైన శైలిలో ట్వీట్స్ చేస్తూ ప్ర‌భుత్వాన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారు. వరుస ట్వీట్లతో పాటు ‘ప్రభుత్వానికి పది ప్రశ్నలు’ పేరుతో ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో వర్మ ప్రశ్నలపై తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పందించారు.

ram gopal varma coments on nani
ram gopal varma coments on nani

ఇక వర్మ ప్రశ్నలకు ఈరోజు ఉదయం పేర్ని నాని స్పందించారు. ఆర్జీవి ట్వీట్లను జత చేస్తూ ఆయన అడిగిన ఒక్కో ప్రశ్నకు సమాధానమిచ్చారు. అదే సమయంలో ఆర్జీవీకి మరిన్ని ప్రశ్నలు వేశారు పేర్నినాని. రూ.100 టికెట్ ను రూ.1000 కి, 2000కి అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయ్? ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్ & సప్లై అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా?..అంటూ రివర్స్ అటాక్ చేశారు నాని.

నాని ట్వీట్స్‌కి మ‌ళ్లీ వ‌ర్మ ట్వీట్స్ చేశారు. తాజాగా పేర్ని నాని ప్రశ్నలకు వర్మ స్పందించారు. తనకు ఎంతో డిగ్నిటీతో సమాధానం చెప్పినందకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు వర్మ తన ట్విట్టర్ ఖాతాలో.. థ్యాంక్యూ నాని గారు..చాలా మంది లీడర్ల లా పరుష పదజాలం తో మాట్లాడకుండా డిగ్నిటీ తో సమాధానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండీ.

ఇక విషయానికి వస్తే వంద రూపాయల టికెట్ ని వెయ్యికి అమ్ముకోవచ్చా? అన్నది క్వశ్చన్ కాదండీ ..అది అమ్మేవాడి నమ్మకం..కొనేవాడి అవసరం బట్టి ఉంటుంది అంటూ క్లారిటీ ఇచ్చారు. నేనడిగే ముఖ్య ప్రశ్న టికెట్ ధర నిర్ణయించటానికి ప్రభుత్వం ఎవరని? పవన్ కళ్యాణ్ సినిమాకి సంపూర్ణేష్ బాబు సినిమాకి మీ ప్రభుత్వం లో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు మీ డ్రైవర్ కి కూడా తేడా లేదా?

రేట్ లు తగ్గిస్తున్నది పేదవాడికి అందుబాటులో ఉండాలని ఎందుకంటే సినిమాని నిత్యావసర వస్తువుగా పరిగణిస్తున్నాము అని చెప్పింది మీ నాయకులే.. అది కానప్పుడు అసలు ఈ డిస్కషన్ ఎందుకు ఇష్యూ లేనప్పుడు? పేదల కోసం చెయ్యడం అనే మీ ఉద్దేశం మంచిది కావచ్చు..కానీ దానికోసం పెదాల్ని ధనికుల్ని చెయ్యటానికి మీ ప్రభుత్వం పని చెయ్యాలి కానీ ఉన్న దనికుల్ని పేదల్ని చెయ్యకూడదు..అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో కల్లా పేద రాష్ట్రం అయ్యే ప్రమాదముంది.

May lose ministry: Perni Nani - Political News

నేను యావరేజ్ ఇంజినీరింగ్ స్టూడెంట్ని, ఎకనామిక్స్ గురించి నాకు ఏ బీ సీ తెలియదు..కానీ అనుమతిస్తే మీ ప్రభుత్వం లో టాప్ ఎకనామిక్స్ ఎక్స్పర్ట్ తో నేను టీవీ డిబేట్ కి రెడీ..మా సినిమా ఇండస్ట్రీ కి ప్రభుత్వానికి ఏర్పడ్డ మిస్ అండ‌ర్ స్టాండింగ్ తొలగిపోవడానికి అవసరం ..థ్యాంక్యూ అంటూ వ‌ర్మ బ‌దులు ఇచ్చారు.