Ram Gopal Varma : ఆ హీరోయిన్ కోసం ఎవరినైనా చంపేస్తా.. ఆర్జీవీ సెన్సేషనల్..!
NQ Staff - June 4, 2023 / 05:44 PM IST

Ram Gopal Varma : ఆర్జీవీ.. ఇది పేరు కాదు ఓ బ్రాండ్. ఇంకా చెప్పాలంటే ఎలా బతకాలో చెప్పే ఓ ఫిలాసఫీ. ప్రజలపై రామూయిజం పేరుతో జనాలపై దాడి చేస్తున్న ఓ దండయాత్ర. కాంట్రవర్సీలకు ఆర్జీవీ కేరాఫ్ అడ్రస్. ఈ విషయం అందరికీ బాగా తెలుసు. అయితే ఆర్జీవీ హీరోయిన్లను ఎంతగా ఆరాదిస్తారనేది అందరికీ బాగా తెలుసు.
ఆయన వయసు ఇప్పుడు అరవై ఏండ్లు. కానీ ఇప్పటికీ బిగ్ బాస్ బ్యూటీలతో బాగా రాసుకుని, పూసుకుని తిరుగుతూ ఉంటారు. అషురెడ్డి కాళ్లు కూడా నాకాడంటే ఆయనకు అమ్మాయిలు అంటే ఎంత పిచ్చి అనేది అర్థం చేసుకోవచ్చు. కాగా ఆర్జీవీ గతంలో లెజెండరీ డైరెక్టర్ గా ఉన్నప్పుడు కూడా శ్రీదేవిని ఎంతగానో ఆదరించేవాడు.
అప్పట్లో శ్రీదేవిని పెండ్లి చేసుకోవాలని కూడా ఆశ పడ్డాడు ఆర్జీవీ. అయితే ఓ సారి రాఘవేంద్రరావు ఆర్జీవీతో ఓ ఇంటర్వ్యూ చేశారు. నీకు శ్రీదేవి అంటే ఎంత ఇష్టం అని ఫన్నీగా అడిగాడు. దానికి ఆర్జీవీ స్పందిస్తూ.. శ్రీదేవి కోసం ఎవరినైనా చంపేస్తా అంట ఇష్టం అంటూ తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చాడు ఆర్జీవీ.
అది విన్న రాఘవేంద్రరావు నవ్వుకున్నారు. మిమ్మల్ని కూడా చంపేస్తా అంటూ ఆర్జీవీ మళ్లీ కౌంటర్ వేశాడు. దాంతో రాఘవేంద్రరావు కాస్త టెన్షన్ పడ్డట్టు కనిపించినా ఆర్జీవీ కామెడీగా చెప్పాడని ఆయనకు కూడా తెలుసు. అందుకే ఆయన లైట్ తీసుకున్నారు. ఇక శ్రీదేవి బోణీ కపూర్ ను పెండ్లి చేసుకున్న సమయంలో ఆర్జీవీ చాలా బాధ పడ్డాడు.