Ram Gopal Varma : నేను త్వ‌రగా చ‌నిపోవాలి అంటూ ఆశ్చ‌ర్య‌ప‌రిచే ట్వీట్స్ చేసిన రామ్ గోపాల్ వ‌ర్మ‌

Ram Gopal Varma : ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ చేసే ట్వీట్స్ నిత్యం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంటాయి. గ‌త కొద్ది రోజులుగా ఆయ‌న సినిమా ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల గురించి త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్రశ్నించారు. సినిమా టికెట్స్ ధరల నిర్ణయం పై సంచలన దర్శకుడు, వివాదాల వర్మ రంగంలోకి దిగిన అనంతరం.. మరింత మాటల యుద్ధం మరింత ఆసక్తికరంగా మారింది.

పేర్ని నానితో భేటి ఆయ‌న అయిన కొద్ది గంట‌ల త‌ర్వాత మ‌ళ్లీ ట్విట్ట‌ర్‌లో ప్ర‌శ్న‌ల వర్షం కురిపించారు. ఆర్ఆర్ఆర్ టిక్కెట్ ధర రూ. 2200/-గా నిర్ణయించింది మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం. అదే తెలుగు వారి సొంత రాష్ట్రంమైన ఆంధ్రప్రదేశ్ లో తమ సినిమా టికెట్ ధరను కనీసం రూ. 200/-లకు కూడా అమ్మలేకపోతున్నారు.

ఇది తెలుగు వారి అస్తిత్వం గురించి ప్రశ్నను లేవనెత్తుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు “కట్టప్పను ఎవరు చంపారు? ” అంటూ.. ఎవరు సినిమా ఇండస్ట్రీని చంపేస్తున్నారంటూ ఇన్ డైరెక్ట్ గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీరుని తప్పు పట్టారు.ఇక నేడు భోగి పండుగ‌ని పుర‌స్క‌రించుకొని వ‌ర్మ పెట్టిన కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

ఏ పండుగకు విష్‌ చేయని రామ్‌ గోపాల్‌ వర్మ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన వజ్రాయుధం ట్వీటర్‌ ద్వారా వరుస ట్వీట్లు చేస్తూ అందరికీ మేలు జరగాలని కోరాడు. ‘అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు అంబానీని మించిన ఇల్లు, డబ్బు రావాలి. మీకు ఇప్పుడు, ఎప్పుడూ ఎలాంటి వైరస్‌ సోకకూడదు అబ్బాయిలకు అందమైన అమ్మాయిలు, అమ్మాయిలకు అందమైన అబ్బాయిలు దొరకాలి’.

‘భర్తలను భార్యలు వేధించకూడదు. మీరు ఏం చేసినా ఏం చేయకున్నా మీతో మీ భార్యలు బాగుండాలి.’ ‘చిన్న సినిమా దర్శక నిర్మాతలకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీ చిన్న సినిమాలు బాహుబలి కంటే పెద్ద హిట్‌ కావాలి.’ ‘నన్ను ద్వేషించే వారికోసం నేను త్వరగా చనిపోవాలి. అంటూ వరుస ట్వీట్లతో సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాడు ఆర్జీవీ.