Ram Charan : ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ల కోసం సతీ సమేతంగా జపాన్‌లో రామ్ చరణ్ సందడి.!
NQ Staff - October 21, 2022 / 09:06 AM IST

Ram Charan : ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ జపాన్‌లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని జపాన్‌లో రిలీజ్ చేసేందుకు గట్టిగా సన్నాహాలు చేశారు. రేపు అనగా, అక్టోబర్ 21న ‘ఆర్ఆర్ఆర్’ జపాన్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.
కొన్ని రోజులు ముందే, ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ జపాన్‌లో ల్యాండ్ అయ్యి, ప్రమోషన్ కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎన్టీయార్, రాజమౌళి ముందే రంగంలోకి దూకి, ప్రమోషన్లకు హాజరవుతుండగా, కాస్త లేట్‌గా రామ్ చరణ్ సందడి మొదలైంది.
చూడ చక్కని జంట.. మెగా కన్నుల పంట..!
రామ్ చరణ్ సతీమణి ఉపాసనతో కలిసి జపాన్‌కి వెళ్లారు. అక్కడ ప్రమోషన్లతో పాటూ, ప్రియ సతి ఉపాసనతో కలిసి వెకేషన్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి ఫేమస్ ఫుడ్‌ని ఆస్వాదిస్తూ, జపాన్‌లోని హిస్టారికల్ లొకేషన్లు, ప్లెజెంట్ ప్లేసెస్‌నీ ఎంజాయ్ చేస్తున్నారు.
ఎక్కడికక్కడ ఫోటోలకు పోజిస్తూ, ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌కి సరికొత్త ట్రీట్ ఇస్తున్నారు. తాజాగా ఉపాసనతో కలిసి చరణ్ జంటగా దిగిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్. చూడముచ్చటైన జంట.. అంటూ ఈ ఫోటోలకు అభిమానులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
లైట్ క్రీమ్ కలర్ మ్యాచింగ్ దుస్తుల్లో ఉపాసన అండ్ చరణ్ జోడీ జపాన్‌లోని ఓ బిగ్ రెస్టారెంట్ వద్ద దిగిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్. మిడీలో ఉపాసన స్టైలిష్ లుక్స్‌లో కనిపిస్తుండగా, క్రీమ్ కలర్ సూట్లో చరణ్ డిఫరెంట్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయ్.