Ram Charan : రామ్‌చరణ్ విలనిజం.! తమిళ సినిమా కోసమట.! నిజమైతే సూపరే.!

NQ Staff - September 22, 2022 / 10:49 PM IST

160185Ram Charan : రామ్‌చరణ్ విలనిజం.! తమిళ సినిమా కోసమట.! నిజమైతే సూపరే.!

Ram Charan : మెగాస్టార్ చిరంజీవి కెరీర్ తొలినాళ్ళలో నెగెటివ్ రోల్స్ చేశారు. మరి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నెగెటివ్ రోల్ చేస్తే.? ఏమో, చెయ్యొచ్చేమో.! ఏమో ఏంటీ, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో చాలాసేపు చరణ్ నెగెటివ్ షేడ్స్‌తోనే కనిపిస్తాడు. అలా చరణ్ నెగెటివ్ యాంగిల్‌లో కనిపించబట్టే, యంగ్ టైగర్ ఎన్టీయార్ పాత్ర పట్ల అంతలా సింపతీ పెరుగుతుంటుంది.

Ram Charan Villainism in tamil movie

Ram Charan Villainism in tamil movie

మరి, రామ్ చరణ్ పూర్తిస్థాయిలో నెగెటివ్ రోల్ చేస్తే.? తెలుగు ప్రేక్షకులు ఒప్పుకోరేమోనన్న చిన్న భయం ఖచ్చితంగా మెగా కాంపౌండ్‌లో వుండి తీరుతుంది. కానీ, సినిమా ట్రెండ్ మారింది. సో, నటీనటులు కూడా సరికొత్త ప్రయోగాలకు సిద్ధమవ్వాల్సిందే.

తమిళ సినిమా కోసమట..

తమిళంలో తెరకెక్కనున్న ఓ భారీ మల్టీస్టారర్ కోసం రామ్ చరణ్‌ని నెగెటివ్ రోల్‌లో చూపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ దర్శకుడు ప్రాజెక్టుని పాన్ ఇండియా స్థాయిలో డిజైన్ చేస్తున్నాడట. నెగెటివ్ అంటే కంప్లీట్ నెగెటివ్.. అని అంటున్నారు.

కాగా, యంగ్ టైగర్ ఎన్టీయార్ ‘లవకుశ’ సినిమాలో నెగెటివ్ షేడ్స్‌తో కనిపించిన సంగతి తెలిసిందే. అందులో త్రిపాత్రాభినయం చేయగా, ఓ రోల్ కంప్లీట్ నెగెటివ్. మరి, చరణ్ ఏం చేయబోతున్నాడో.. అసలు ఈ గాసిప్‌లో వాస్తవమెంతో.!