Ram Charan Tej And Upasana : మెగా వారసుడు రాబోతున్నాడోచ్‌..! తండ్రి కాబోతున్న మిస్టర్‌ C ??

NQ Staff - September 22, 2022 / 01:19 PM IST

Ram Charan Tej And Upasana : మెగా వారసుడు రాబోతున్నాడోచ్‌..! తండ్రి కాబోతున్న మిస్టర్‌ C ??

Ram Charan Tej And Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  మరియు ఉపాసనల పెళ్లి జరిగి 10 సంవత్సరాలకు పైగానే అయింది. అయినా కూడా ఇద్దరు ఇప్పటి వరకు వారు తల్లిదండ్రులు కాకపోవడంతో అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఎప్పుడు మెగా ఫ్యామిలీలో వారసుడు రాబోతున్నాడు అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఉపాసన కూడా ఈ ప్రశ్నను పలు ఇంటర్వ్యూలో ఎదుర్కొంది. అందుకు ఆమె ప్రతి సారి కూడా తాము తల్లిదండ్రులం అయేందుకు చాలా సమయం ఉందని, ప్రస్తుతం మేమిద్దరం కెరియర్ పై దృష్టి పెట్టాము అన్నట్లుగా చెప్పుకొచ్చారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం

Ram Charan Tej And Upasana Are Going Be Parents

Ram Charan Tej And Upasana Are Going Be Parents

వీరు తల్లిదండ్రులు కాబోతున్నారట. మెగా కాంపౌండ్ నుండి అందుతున్న వార్తల అనుసారం రామ్ చరణ్ మరియు ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారని ఆ విషయం మెగా కుటుంబంలో ఆనందాన్ని నింపిందని అంటున్నారు.

మరో ఐదు ఆరు నెలల్లో మెగా స్టార్ ఇంట్లో బుల్లి స్టార్ అడుగు పెట్టబోతున్నాడని వారు అంటున్నారు. ఈ వార్తల్లో నిజం ఎంత అనే విషయం ప్రస్తుతం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మెగా అభిమానులు మాత్రం ఈ వార్త నిజం అవ్వాలని కోరుకుంటున్నాం అంటున్నారు. పది సంవత్సరాలు దాటిన తర్వాత రామ్ చరణ్ మరియు ఉపాసన తల్లిదండ్రులు అవ్వబోతున్న నేపథ్యంలో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. రాంచరణ్, ఉపాసనలు ఈ వార్త నిజం కాదని అభిమానుల యొక్క ఆనందాన్ని నీరుగారుస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us