Ram Charan : వీరయ్య వేడుకలో రామ్ చరణ్ హెచ్చరికల వెనుక కారణం ఏంటీ?
NQ Staff - January 29, 2023 / 11:48 AM IST

Ram Charan : మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ అయినా నేపథ్యంలో వరంగల్ లో భారీ సక్సెస్ వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. తన తండ్రి సౌమ్యుడు అయి ఉండవచ్చు.. కానీ ఆయన కుటుంబ సభ్యులమైన మేము మరియు అభిమానులు సామ్యులు కారు.. ఆయనను ఒక్క మాట అంటే ఊరుకునేది లేదు అంటూ హెచ్చరించాడు.
చిరంజీవి గారిని ఏదైనా మాట అనాలి అంటే ఆయన కుటుంబ సభ్యులు లేదా ఆయన అభిమానులు అయి ఉండాలి. బయటి వారు ఆయన గురించి మాట్లాడితే చాలా సీరియస్ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్ ఎవరిని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేశాడు అంటూ ఇప్పుడు చర్చ జరగుతోంది. గత కొన్నాళ్లుగా చిరంజీవిని పదే పదే కొందరు విమర్శలు చేస్తున్నారు. అందుకే చరణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటాడు అనేది టాక్. రామ్ చరణ్ హెచ్చరికలతో అయినా వారు కాస్త సైలెంట్ అవుతారా అనేది చూడాలి.