Ram Charan : ‘ఆరెంజ్’ రీ రిలీజ్ తో వచ్చింది అంతేనా?
NQ Staff - May 19, 2023 / 10:33 PM IST

Ram Charan : రామ్ చరణ్ హీరోగా నటించిన ఆరంజ్ సినిమా ను ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే, నాగబాబు నిర్మాణంలో వచ్చిన ఆ సినిమా రీ రిలీజ్ తో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
అప్పట్లో సినిమా రిలీజ్ అయిన సందర్భంగా డిజాస్టర్ గా నిలిచింది. నాగబాబుకి భారీ నష్టాలను మిగిల్చింది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత విడుదలై మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి.
తాజాగా ఆ సినిమా రీ రిలీజ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి అందజేసినట్లుగా సమాచారం అందుతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కోటి రూపాయల వరకు వసూలు నమోదు అయినట్లుగా తెలుస్తోంది.
ఖర్చులు పోయిన తర్వాత మిగిలిన కోటి రూపాయలను జనసేన పార్టీ విరాళంగా నాగబాబు పవన్ కళ్యాణ్ కి అందించాడని సమాచారం అందుతుంది. ఈ మధ్య కాలంలో చిన్న హీరోల సినిమాలు కూడా భారీగా కలెక్షన్స్ నమోదు చేస్తున్నాయి.
కానీ ఆరెంజ్ వంటి పెద్ద హీరో సినిమా అది కూడా జనసేన పార్టీ కోసం విరాళంగా కలెక్షన్స్ ఇవ్వాలనుకున్న సినిమా కేవలం కోటి రూపాయలు మాత్రమే కలెక్ట్ చేయడం ఏంటి అంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎక్కువ కలెక్షన్స్ వస్తే అందులో కొద్ది మొత్తమే జనసేనకి విరాళంగా ఇస్తున్నారా అని అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది వారికే తెలియాలి.