Ram Charan And Buchibabu Sana : రేపే… రామ్ చరణ్ ఫ్యాన్స్ బిగ్ బిగ్ గుడ్ న్యూస్
NQ Staff - November 27, 2022 / 07:34 PM IST

Ram Charan And Buchibabu Sana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం న్యూజిలాండ్‌లో జరుపుతున్నారు.
అక్కడ అత్యంత అరుదైన లొకేషన్స్ లో పాట చిత్రీకరణ జరుగుతున్నట్లుగా నిర్మాణ సంస్థ వర్గాల వారు ప్రకటించారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలోనే రామ్ చరణ్ తన తదుపరి సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేయబోతున్నాడు.
ఇప్పటికే గౌతం తిన్ననూరి దర్శకత్వంలో సినిమా ను రామ్ చరణ్ చేసేందుకు ఓకే చెప్పాడు. యు వి క్రియేషన్స్ వారు అధికారికంగా ప్రకటించారు. కానీ ఆ సినిమా క్యాన్సిల్ అయింది. దాంతో ఇప్పుడు ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన రాబోతుంది.
రేపు ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఆ ప్రకటన ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు ఆ సమయంలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
రాంచరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. రాంచరణ్ తో సినిమా పూర్తి చేసిన తర్వాత ఎన్టీఆర్ హీరో గా బుచ్చిబాబు సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.