Ram Charan And Buchibabu Sana : అధికారికం : బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్‌చరణ్

NQ Staff - November 28, 2022 / 12:14 PM IST

Ram Charan And Buchibabu Sana : అధికారికం : బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్‌చరణ్

Ram Charan And Buchibabu Sana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కన్ఫామ్ చేసేశాడు.. తాను బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ అలాగే వృద్ధి సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి.

బుచ్చిబాబు సన తన తొలి ప్రయత్నంలోనే ‘ఉప్పెన’ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అంందుకున్నాడు. సుకుమార్ శిష్యుడిగా ‘రంగస్థలం’ సినిమాకి వర్క్ చేశాడు. ఆ సినిమాలోని చిట్టిబాబు పాత్ర అంత అద్భుతంగా రావడానికి బుచ్చిబాబు సన కారణమంటూ పదే పదే ‘రంగస్థలం’ సినిమా ప్రమోషన్లలో సుకుమార్ చెబుతూ వచ్చిన సంగతి తెలిసిందే.

ఉప్పెనకు మించిన అద్భుతం తీస్తాడా.?

Ram Charan Doing Movie Directed By Buchibabu Sana

Ram Charan Doing Movie Directed By Buchibabu Sana

కొత్త హీరో.. కొత్త హీరోయిన్.. చాలా చాలా కొత్త కథ.. వెరసి ‘ఉప్పెన’ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు బుచ్చిబాబు సన. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు, యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించాల్సి వచ్చింది. కానీ, ఎన్టీయార్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.

ప్రస్తుతం చరణ్ సైతం బిజీగానే వున్నాడు. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీద వుంది. ఆ తర్వాత బుచ్చిబాబు సినిమా సెట్స్ మీదకు వెళుతుందా.. ఈలోగానే సెట్స్ మీదకు సినిమాని తీసుకెళతారా.? అన్నది వేచి చూడాల్సిందే. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రానికి నిర్మాత.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us