Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ ‘జీబ్రా’ గ్లామర్ అదుర్స్ గురూ.!
NQ Staff - August 28, 2022 / 05:46 PM IST

Rakul Preet Singh : ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కానీ, ఇప్పుడు టాలీవుడ్లో రకుల్ హవా అంతగా కనిపించడం లేదు. అందుకు కారణం రకుల్ ప్రీత్ బాలీవుడ్ సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టడమే.

Rakul Preet Singh new cute photos
తెలుగులో స్టార్ హీరోలందరి సరసనా నటించేసిన రకుల్ ప్రీత్ సింగ్, ‘అయ్యారీ’ సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టింది. మొదట్లో అంతంత మాత్రంగానే రకుల్ కెరీర్ నడిచింది.
బాలీవుడ్‌కి వెళ్లాకా, టాలీవుడ్ నుంచీ అవకాశాలు కరువైపోయాయ్. దాంతో రెంటికీ చెడ్డ రేవటిలా తయారైంది రకుల్ పరిస్థితి కొంతకాలం. కానీ, ఇప్పుడు నిలదొక్కుకుంది. బాలీవుడ్లో మంచి మంచి ఆఫర్లు కొట్టేస్తోంది. ఇటీవల ‘మషూకా’ అనే వీడియో ఆల్బమ్‌తో రకుల్ పేరు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెగ మార్మోగిపోయిన సంగతి తెలిసిందే.

Rakul Preet Singh new cute photos
తెలుగు భాష లెక్క రకుల్ అక్కడా, ఇక్కడా..
ఇటీవలే ‘రన్ వే 34’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాలో అక్షయ్‌తో పాటూ రకుల్ కూడా పైలైట్‌గా నటించి మెప్పించింది.
ప్రస్తుతం విశ్వ నటుడు కమల్ హాసన్‌తో ‘ఇండియన్ 2’ సినిమాలో రకుల్ నటిస్తోంది. అలాగే, ‘31 అక్టోబర్ లేడీస్ నైట్’ అనే బైలింగ్వల్ మూవీలోనూ రకుల్ నటిస్తోంది. ఇక, హిందీలో రకుల్ పూర్తి చేసిన ఐదారు సినిమాల వరకూ విడుదలకు సిద్ధంగా వున్నాయ్.
అలా మళ్లీ రకుల్ కెరీర్ గాడిన పడింది. అన్ని భాషల్లోనూ దున్నేస్తోంది. గ్లామర్ పాత్రల కన్నా, యాక్టింగ్‌కి స్కోపున్న పాత్రలనే రకుల్ ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటోంది. ఆయా పాత్రలతో అలాగే మెప్పిస్తోంది కూడా. దాంతో పాటూ సోషల్ మీడియానీ తన గ్లామర్‌తో షేక్ చేస్తోంది రకుల్ ప్రీత్.

Rakul Preet Singh new cute photos