Rajamouli : న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డు : జక్కన్న ఖాతాలో మరో ప్రతిష్టాత్మక పురస్కారం.!

NQ Staff - December 3, 2022 / 05:02 PM IST

Rajamouli  : న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డు : జక్కన్న ఖాతాలో మరో ప్రతిష్టాత్మక పురస్కారం.!

Rajamouli  : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి మరో ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. హాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారాల్లో ఒకటైన న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ పురస్కారం ఈసారి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి దక్కింది. అమెరికాలో తాజాగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికిగాను ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఈ అవార్డుని సొంతం చేసుకున్నారు.

వార్తా పత్రికలు, మ్యాగజైన్స్, ఆన్‌లైన్ పబ్లికేషన్స్‌కి సంబంధించిన పలువురు ప్రముఖులు ఓ బృందంగా మారి ఈ పురస్కారాలకు విజేతల్ని ఎంపిక చేస్తారు. 1935 నుంచి ఈ అవార్డుల్ని అందజేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఆస్కార్‌కి ముందు.. ఇదో అద్భుతం.!

‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ఆస్కార్ బరిలోకి దింపేందుకోసం రాజమౌళి అండ్ టీమ్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమాని జనంలోకి తీసుకెళుతూ, ఆయా అవార్డుల జ్యూరీ సభ్యుల కోసం కూడా ప్రత్యేక ప్రదర్శనలు వేస్తూ వస్తున్నారు.

ఇంకోపక్క, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో ఓ చోట ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి సంబంధించిన ఈవెంట్లు జరుగుతుండడంతో, ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ సందడి అనూహ్యంగా కొనసాగుతున్నట్లవుతోంది.

ఏదిఏమైనా, జక్కన్న తెలుగు సినిమా స్థాయిని భారతీయ సినిమా స్థాయికి.. అది దాటి, అంతర్జాతీయ సినిమా స్థాయికి తీసుకెళ్ళి, అంతర్జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకుంటున్నందుకు మనమంతా గర్వపడాల్సిందే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us