RRR Sequel : ఆర్‌ఆర్‌ఆర్ సీక్వెల్ పై జక్కన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్
NQ Staff - November 4, 2022 / 11:48 AM IST

RRR Sequel : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తాజాగా తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 1000 కోట్ల కు పైగా కలెక్షన్స్ నమోదు చేయడం జరిగింది.
ప్రపంచ వ్యాప్తం గా డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా స్ట్రీమింగ్ అయ్యి అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకున్న విషయం కూడా తెలిసిందే. ఇదే సమయం లో ఆస్కార్ పోటీలో కూడా ఈ సినిమా నిలువబోతోంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకం తో ఉన్నారు.
ఇక ఈ సినిమా యొక్క సీక్వెల్ గురించి టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొమరం భీమ్ మరియు అల్లూరి సీతారామ రాజు ల మధ్య ఫైట్ ఉంటేనే ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ కూడా బాగుంటుందని ఆ దిశ గా స్క్రిప్ట్ ఏదైనా ఆలోచన చేస్తాను అన్నట్లుగా హింట్ ఇచ్చాడు.
ఇద్దరు హీరోల మధ్య తీవ్రమైన పోటీ ఉంటేనే సినిమా బాగుంటుందని, ఆ ఉద్దేశం తో రాజమౌళి సీక్వెల్ ఆలోచన లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక వేళ ఈ సినిమా కు ఆస్కార్ అవార్డు దక్కితే కచ్చితం గా సీక్వెల్ ఆలోచన చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.