Rajamouli : రూ.420 కోట్ల అప్పు చేసిన రాజమౌళి.. ఇన్నాళ్లకు బయట పడిన నిజం..!
NQ Staff - June 4, 2023 / 09:47 AM IST

Rajamouli : టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళికి అప్పుడు ఉన్నాయంటే బహుషా ఎవరూ నమ్మరు. ఎందుకంటే ఆయన సక్సెస్ ఫుల్ డైరెక్టర్. ఇప్పటి వరకు అపజయం అన్నది ఎరగడు. ఆయన అడగాలే గానీ వందల కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉంటారు. అలాంటి ఆయన కూడా అప్పులు చేయాల్సి వచ్చిందంట.
అంటే తన కోసం కాదనుకోండి సినిమా కోసం. నిర్మాతలతో అప్పులు చేయించారంట రాజమౌళి. ఈ విషయాలను తాజాగా దగ్గుబాటి రానా వెల్లడించారు. ఆయన రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. నిర్మాతలు సినిమా కోసం ఇప్పుడు అధిక వడ్డీ రేట్లకు అప్పులు తీసుకువస్తున్నారు.
బాహుబలి సమయంలో మేం కూడా రూ.రూ.400 కోట్ల రూపాయలను ఆ వడ్డీ రేటుకి తీసుకువచ్చాం. దాదాపు 24% వడ్డీ రేటుకు ఐదున్నర ఏళ్ల పాటు ఈ అప్పు మొత్తాన్ని తీసుకువచ్చారు. అంత పెద్ద మొత్తంలో సౌత్ ఇండస్ట్రీలోనే మొదటిసారి తీసుకువచ్చారు. అప్పుడు మాకున్న ఒకే ఒక నమ్మకం రాజమౌళి.
ఆయన మీదున్న నమ్మకంతోనే ముందుకు వెళ్లాం. బాహుబలి సక్సెస్ అయింది కాబట్టి ఆ అప్పులు ఈజీగా తీర్చేశాం. కానీ ఫెయిల్ అయి ఉంటే పరిస్థితి ఏంటనేది ఊహించుకోవడానికే భయంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు రానా. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.