Radhika Sharath Kumar :రాధిక 60వ బర్త్ డే వేడుక… హాజరైన ఫ్రెండ్స్, ఫ్యామిలీ
NQ Staff - August 22, 2022 / 02:24 PM IST

Radhika Sharath Kumar : రాధిక శరత్ కుమార్.. ఒకప్పుడు చలన చిత్ర సీమలో తన హవా చూపించింది. ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో కూడా అలరిస్తుంది. చిరంజీవి-రాధిక కాంబోలో సినిమా అంటే సూపర్ హిట్ కాంబినేషన్. టాలీవుడ్లో ఎక్కువ సినిమాలు కలిసి నటించిన జోడీగా చిరంజీవి-రాధికల జంటకు మంచి పేరు ఉంది.

Radhika Birthday Attended Celebrities
బర్త్ డే హంగామా..
సందెపొద్దుల కాడ సంపంగి నవ్విందీ అంటూ ఈ జంట వెండితెరపై ఓ వెలుగు వెలిగింది. రాధిక కేవలం సినిమాలు మాత్రమే కాకుండా సీరియల్స్ లో కూడా నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేశారు. ఆగస్టు 21వ తేదీ రాధిక తన 60 వ పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.నేడు తన 60వ పుట్టినరోజు అని తెలియడంతో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అభిమానులు ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Radhika Birthday Attended Celebrities
ఇక రాధిక బర్త్ వేడక తాజాగా జరగగా, ఈ కార్యక్రమంలో నటీమణులు రమ్యకృష్ణ, మీనా, కుష్బూ వంటి తదితర హీరోయిన్లు ఈ పార్టీకి హాజరయ్యి తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Radhika Birthday Attended Celebrities
అదేవిధంగా మొదటిసారి ఈమె పుట్టినరోజు వేడుకలకు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన భార్య జ్యోతికతో కలిసి హాజరయ్యారు.

Radhika Birthday Attended Celebrities
ఇలా రాధిక పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున సెలబ్రిటీలు హాజరు కావడంతో ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Radhika Birthday Attended Celebrities
ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు. తాజాగా తన బర్త్ డే వేడుకకి సంబంధించిన పిక్స్ షేర్ చేయగా, వైరల్ అవుతున్నాయి.