Radhakrishnas : అమెజాన్‌లో రాధాకృష్ణుల అశ్లీల ఫోటోలు.. బాయ్‌కాట్ చేయాలంటూ డిమాండ్
NQ Staff - August 20, 2022 / 08:48 AM IST

Radhakrishnas : ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇటీవల వివాదాలలో ఎక్కువగా చిక్కుకుంటుంది. హిందూ దేవుళ్లని అవమానిస్తూ అమెజాన్ కొన్ని వస్తువులని విక్రయిస్తుందని, వెంటనే అమెజాన్‌ని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకృష్ణాష్టమి సందర్బంగా అమెజాన్ అభ్యంతర కరమైన ఫోటోను షేర్ చేసి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందని కొందరు మండిపడుతున్నారు.

Radhakrishnas obscene photos on Amazon
అమెజాన్‌పై ఆగ్రహం..
దీంతో సోషల్ మీడియాలో బాయకాట్ అమెజాన్ హ్యాష్‌టాగ్ ట్రెండ్ అవుతోంది. అంతేకాదు ఈ వ్యవహారంలో వెంటనే క్షమాపణ చెప్పాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పవిత్రమైన రాధాకృష్ణుల బంధాన్ని, ప్రేమను అవమానించింది. అసలు ఇలాంటి అసభ్య చిత్రాలను విక్రయించే ధైర్యం అమెజాన్ ఎలా చేస్తుందని ప్రశ్నిస్తున్నారు.
‘షేమ్ ఆన్ యూ’ అంటూ మండిపడుతున్నారు. ఇందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ అమెజాన్‌పై సోషల్ మీడియా యూజర్లు దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో ఎక్సోటిక్ ఇండియాపై ఇవే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫలితంగా ట్విటర్‌లో #Boycott_Amazon #Boycott_ExoticIndia జోరు కొనసాగుతోంది.
అమెజాన్ వెబ్ సైట్‌లో జన్మాష్టమి సందర్భంగా 20 శాతం సేల్ అంటూ వెబ్‌సైట్‌లో రాధతో శ్రీకృష్ణుడు ఉన్న అశ్లీల పెయింటింగ్‌ను విక్రయించడం మొదలు పెట్టింది. దీనిపై హిందూ జాగృతి సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెజాన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బెంగుళూరులోని సుబ్రమణ్య నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. .