Raashi Khanna : హీరో కార్తి బాధితుల సంఘం.! అప్పుడు రకుల్, ఇప్పుడు రాశీఖన్నా.!

NQ Staff - October 22, 2022 / 04:59 PM IST

Raashi Khanna : హీరో కార్తి బాధితుల సంఘం.! అప్పుడు రకుల్, ఇప్పుడు రాశీఖన్నా.!

Raashi Khanna : కార్తి హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘సర్దార్’. కార్తి సినిమాలంటే తెలుగు ప్రేక్షకుల్లోనూ ప్రత్యేకమైన ఆసక్తి వుంటుంది. అంతలా తెలుగులోనూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు హీరో కార్తి.

అయితే, తాజాగా కార్తి నటించిన ‘సర్దార్’ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా.? అందాల భామ రాశీఖన్నా. నిజానికి తెలుగులో రాశీ ఖన్నా ఊపు కాస్త తగ్గిందనే చెప్పాలేమో. బాలీవుడ్‌లో డిఫరెంట్ ఛాన్సెస్ దక్కించు కుంటున్న రాశీ ఖన్నా తెలుగులో మూస కథలకే ప్రాధాన్యత ఇస్తోంది.

పాపం రాశీఖన్నా: ‘సర్దార్’ అన్యాయం చేశాడే.!

సరే, అసలు విషయానికి వచ్చేద్దాం. ‘సర్దార్’ సినిమా గురించి గత కొన్ని రోజులుగా టాక్ నడుస్తోంది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ గురించి మాత్రం ఎక్కడా మాట్లాడుకోలేదు పాపం.

గతంలో కార్తి హీరోగా వచ్చిన ‘ఖాకీ’ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. అప్పుడు సినిమాలోని ఇంటెన్సిటీ తగ్గిపోతోందన్న భావనతో, రిలీజ్ అయ్యాకా సినిమాలోని హీరోయిన్ ట్రాక్‌ని నిర్ధాక్షిణ్యంగా లేపేసిన సంగతి అప్పట్లో ఇష్యూ అయ్యింది. నిజం చెప్పాలంటే హీరోయిన్‌గా రకుల్‌కి అది తీరని అవమానమే.

ఇప్పుడు రాశీ ఖన్నా విషయంలోనూ అలాంటి అవమానమే జరిగిందంటూ ఆమె అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. కానీ, స్టార్ హీరో సినిమాల్లో ఇలాంటివి అప్పుడప్పుడూ జరుగుతుంటాయ్ చూసీ చూడనట్లు సర్దుకుపోవాలంతే.!

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us