Raai Laxmi : బికినీలో మతులు పోగొడుతున్న రాయ్ లక్ష్మి.!

NQ Staff - November 24, 2022 / 09:26 PM IST

Raai Laxmi  : బికినీలో మతులు పోగొడుతున్న రాయ్ లక్ష్మి.!

Raai Laxmi  : ‘రత్తాలు.. రత్తాలు.. ఓసోసీ రత్తాలూ..’ అంటూ మెగాస్టార్ చిరంజీవి పక్కన ఎప్పుడయితే ‘స్పెషల్’ చిందులేసిందో.. అప్పటి నుంచీ రాయ్ లక్ష్మి దశ తిరిగిపోయింది. నిజానికి అప్పుడెప్పుడో ‘కాంచన మాల కేబుల్ టీవీ’ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మి.

తొలి సినిమాకే ఎంత చేయాలో అంత చేసేసింది హాట్ అప్పీల్‌లో. అంత చేసినా రాయ్ లక్ష్మిని పట్టించుకోలేదు. కానీ, చిరంజీవితో సినిమానే రాయ్ లక్ష్మికి పెద్ద బ్రేక్ అని చెప్పాలి.

బాలీవుడ్‌లోనూ రత్తాలు సందడి..

‘జూలీ 2’ సినిమా కోసం బాలీవుడ్‌లో అడుగు పెట్టింది రత్తాలుగా రాయ్ లక్ష్మి. ఆ సినిమా రిలీజ్‌కి ముందు బికినీలతో రాయ్ లక్ష్మి చేసిన సందడి అంతా ఇంతా కాదు. చేసింది ఒకే ఒక్క సినిమా అయినా రాయ్ లక్ష్మిని బాలీవుడ్ జనం అస్సలు మర్చపోలేరు.

Raai Laxmi Latest Bikini Beautiful Photos

Raai Laxmi Latest Bikini Beautiful Photos

ఎందుకంటే, ఈ సినిమాలో నూరు రకాల బికినీలను ధరించి రికార్డు సృష్టించింది రాయ్ లక్ష్మి. అంత చేసినా బ్యాడ్ లక్.. సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సినిమా హిట్ అయ్యుంటేనా.. రాయ్ లక్ష్మి కెరీర్ మరోలా వుండేది మరి.

అయితేనేం, అలా ‘జూలీ 2’ పుణ్యమా అని, బికినీలతో పేరు తెచ్చుకున్న రాయ్ లక్ష్మి ఆ తర్వాత బికినీ పోజులకు కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. బికినీలో రత్తాలు నుంచి ఏ ఫోటో వచ్చినా సరే, క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది. తాజా బికినీ పిక్ ఆ కోవకు చెందిందే. పింక్ హాట్ కుచ్చుల బికినీలో రాయ్ లక్ష్మి వావ్.! వాట్ ఏ బ్యూటీ.!

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us