Pushpa2 : ‘పుష్ప ది రూల్’: డైలాగ్ లీకయ్యింది.. వైరల్ అవుతోంది.!

NQ Staff - December 11, 2022 / 08:25 PM IST

Pushpa2 : ‘పుష్ప ది రూల్’: డైలాగ్ లీకయ్యింది.. వైరల్ అవుతోంది.!

Pushpa2 : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మండన్న జంటగా తెరకెక్కనున్న ‘పుష్ప ది రూల్’ సినిమా నుంచి ఓ డైలాగ్ లీక్ అయ్యింది. నిజంగానే లీక్ అయ్యిందా.? లేదంటే, ఫేక్ వ్యవహారమా.? అన్నది పక్కన పెడితే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు మాత్రం దీన్ని ‘ఐకానిక్ డైలాగ్’ అంటున్నారు.

‘అడవిలోని జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం.. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజ్ వచ్చాడని అర్థం..’ ఇదీ ఆ డైలాగ్.

రష్యాలో దుమ్ము రేపేస్తోందట..

ఇటీవల ‘పుష్ప ది రైజ్’ సినిమాని రష్యాలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. రష్యాలో ప్రమోషన్స్ కోసం అక్కడికి వెళ్ళింది ‘పుష్ప’ టీమ్.

కాగా, ‘పుష్ప ది రైజ్’ అనూహ్యమైన రీతిలో విజయం సాధించిన దరిమిలా, అంతకు మించి.. అనే స్థాయిలో సినిమాని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది.

పాన్ ఇండియా కాదు.. ఈసారి పాన్ వరల్డ్ స్థాయిలో ‘పుష్ప ది రూల్’ని సక్సెస్ చేసేలా ప్రణాళికలు రచిస్తోంది ‘పుష్ప’ టీమ్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us