Pushpa Bomma Hittu: పుష్ప రాజ్ త‌గ్గేదే లే.. భారీగా వ‌సూళ్లు రాబ‌ట్టిన బ‌న్నీ మూవీ

 

Pushpa Bomma Hittu:  అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద తగ్గేదేలే అంటూ దుమ్మురేపుతుంది. డిసెంబర్‌17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబడుతుంది. అన్ని ఏరియాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతూ కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటోంది.

pushpa bomma hittu
pushpa bomma hittu

తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా నమోదు చేస్తున్న పుష్ప వసూళ్లు బన్నీ అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. ఓ వైపు పుష్పరాజ్ వసూళ్ల సునామీ సృష్టిస్తుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్స్ రేట్స్ ఇష్యూ ట్రేడ్ వర్గాల్లో కాస్త ఆందోళన రేకెత్తిస్తోంది. లో- టికెట్ రేట్స్ కారణంగా ‘పుష్ప’ ఆశించిన మేర వసూళ్లు రాబట్టలేక పోతున్నాడని అంటున్నారు. ఐదో రోజుతో పోల్చితే ఆరో రోజు ఈ సినిమా కలెక్షన్స్ కొంతమేర డ్రాప్ అయినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి.

pusha bomma hittu
pusha bomma hittu

ఈ 6 రోజుల్లో ‘పుష్ప’ రోజువారీ వసూళ్లు ఇలా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలి రోజుకు గాను 24.9 కోట్ల రూపాయలు వసూలు చేసిన పుష్పరాజ్.. రెండు రోజు 13.70 కోట్లు, మూడో రోజు 14.38 కోట్లు, నాలుగో రోజు 6.92 కోట్లు, ఐదో రోజుకు గాను 3.87 కోట్లు, ఆరో రోజుకు గాను 3 రూపాయల మేర కలెక్షన్స్ వసూలు చేశారు.

AlluArjun Rashmika Pushpa
AlluArjun Rashmika Pushpa

మొత్తంగా చూస్తే 100 క్లబ్‌లో చేరిన అల్లు అర్జున్.. డీసెంట్ రన్ కొనసాగిస్తున్నారు. టికెట్ల రేట్ల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతించి ఉంటే కలెక్షన్స్ మరో రేంజ్‌లో ఉండేవని చెబుతున్నారు ట్రేడ్ విశ్లేషకులు. రిలీజ్‌కి ముందు పుష్ప మూవీపై భారీ హైప్ క్రియేట్ కావడంతో 145 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన పుష్పరాజ్ ఆ దిశగా పరుగులు పెడుతున్నారు.

pushpa
pushpa

క్రిస్మస్‌ పండగను కూడా పురస్కరించుకొని మరిన్ని లాభాలు తెచ్చిపెడుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పుష్పరాజ్‌గా బన్నీ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తెలుగు, తమిళం సహా హిందీలోనూ మంచి కలెక్షన్లను వసూలు చేస్తుంది ఈ చిత్రం