Pushpa 2 : అల్లు అర్జున్ కోసం రామ్ చరణ్.! నిజమైతే పూనకాలే.!
NQ Staff - December 12, 2022 / 01:27 PM IST

Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ సాధించిన సక్సెస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్లో ‘పుష్ప ది రూల్’ రాబోతోంది.
పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ ఈసారి చేయబోయే సందడి మామూలుగా వుండదని చిత్ర యూనిట్ అంటోంది. అయితే, దీనికి మెగా పవర్ అద్దాలనే ఆలోచనలో దర్శకుడు సుకుమార్ వున్నాడట.
పాన్ ఇండియా.. అంతకు మించి..
‘పుష్ప ది రూల్’ సినిమా కోసం పాన్ ఇండియా కాదు, అంతకు మించిన ఆలోచనలు చేస్తున్నాడు దర్శకుడు సుకుమార్. ఈ క్రమంలోనే సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ చిన్న రోల్ చేయించాలనుకుంటున్నాడట.
నిజానికి, ఈ ఆలోచన అల్లు అర్జున్‌దేనని అంటున్నారు. గతంలో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ‘ఎవడు’ సినిమాలో అల్లు అర్జున్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేశాడు. ఆ రోల్ అప్పట్లో సంచలనం. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సినిమా అది.
సో, తెరపై చరణ్ – అల్లు అర్జున్ ఒకేసారి కనిపిస్తే.. ‘పుష్ప ది రూల్’కి అది ఇచ్చే కిక్ మామూలుగా వుండదు మరి.! చూద్దాం.. ఈ ప్రచారంలో నిజమెంతో.!