Puri Jagannadh :లైగర్ దెబ్బ నుంచి పూరీ ఇప్పట్లో కోలుకునేట్టు లేడుగా! మళ్లీ ఆస్తుల అమ్మకాలు?
NQ Staff - September 21, 2022 / 02:29 PM IST

Puri Jagannadh : ఆగ్ లగా దేంగే అంటూ భారీ అంచనాల మధ్య బాక్సాఫీస్ కి ఎంట్రీ ఇచ్చిన లైగర్ బంపర్ డిజాస్టర్ పాలైన విషయం తెలిసిందే. అయితే లైగర్ రిజల్ట్ ఎఫెక్ట్ మాత్రం ఆ ప్రాజెక్ట్ లోని స్టార్స్ అండ్ టెక్నీషియన్స్ పై ఏమో గానీ, పూరీ పై మాత్రం గట్టిగా పడింది. ఎంతలా అంటే ఇప్పట్లో కోలుకోవడం చా..లా కష్టమేమో అనిపించేంతలా.
ఓవైపు లైగర్ విడుదలకు ముందే స్టార్ట్ చేసిన మరో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ JGM ఆగిపోయింది. ఇంకోవైపు చెల్లించాల్సిన డబ్బులు, చేసిన అప్పుల తాలూకు నష్టాలు ఇంకా వెంటాడుతున్నాయి. కథ మీద అతినమ్మకంతో దాదాపు ముప్పై కోట్ల విలువైన ప్రాపర్టీనమ్మి సినిమాలో పెట్టుబడి పెట్టాడట పూరీ. తీరా సినిమా దారుణమైన డిజాస్టర్ అని తేలాక ఇప్పటికే ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లకి డబ్బులు తిరిగి చెల్లించేశాడు.
మిగతా వాళ్లకి కూడా ఇస్తానని ప్రామిస్ చేసి కాకపోతే రెండు నెలల టైమ్ కావాలని అడిగాడట. ఆ డబ్బుకోసం మిగతా ప్రాపర్టీలను కూడా అమ్మేందుకు ప్లాన్ చేస్తున్నాడట.
నిజానికి లైగర్ మూవీ కోసం కథనీ,

Puri Jagannadh Selling Properties with Ligar Disaster
పూరీని నమ్మి మేకర్స్ నుంచి కాస్ట్ అండ్ క్రూ వరకూ అందరూ ప్రాపర్ గానే కాంట్రిబ్యూట్ చేశారు. లాక్ డౌన్, ప్యాండెమిక్ ఎఫెక్ట్స్ ని కూడా తట్టుకుని సినిమా కోసం పనిచేశారు. నేషన్ వైడ్ గా ప్రమోషన్స్ చేస్తూ, హైప్ పెంచడానికి అన్ని ప్రయత్నాలూ చేశారు. కానీ వన్స్ సినిమా రిలీజయ్ వరస్ట్ రిజల్ట్ ని ఫేస్ చేశాక పూరీకి మాత్రమే భారీ ఎఫెక్ట్ పడింది.
విజయ్ దేవరకొండ తన సినిమాలు తను చేసుకుంటూ అప్ కమింగ్ ప్రాజెక్ట్ షూట్స్ తో బిజీగా ఉన్నాడు. ఇక కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన కరణ్ జోహర్ ఇమేజ్ కి గానీ, ఆయన ప్రాజెక్ట్స్ కీ గానీ వచ్చిన నష్టమేమీ లేదు. ఇక అనన్య పాండే నెపో కిడ్ గా ఇప్పటివరకూ పెద్దగా సాధించిందేమీ లేదు. లైగర్ లో లాసయ్యిందేమీ లేదు. ఎటొచ్చీ అన్నిరకాలుగా నష్టపోయింది పూరీ మాత్రమే. షూట్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇన్వెస్టర్స్ ఇక మా వల్ల కాదంటూ బడ్జెట్ పెట్టలేమంటూ తప్పుకున్నారు. ఓవైపు లైగర్ రిజల్ట్ చూశాక ఏ ప్రొడ్యూసరూ కొత్త సినిమా ఇచ్చే ధైర్యం చేయట్లేదు. పోనీ ఓన్ బ్యానర్ లోనే మరో మూవీ చేద్దామా అంటే ఇప్పుడున్న నష్టాలనుంచే ఎలా కోలుకోవాలో,
ఎలా బైటపడాలో తెలీని పరిస్థితి. మరీ ఓపెన్ గా చెప్పాలంటే దుస్థితి.

Puri Jagannadh Selling Properties with Ligar Disaster
గతంలోనూ పూరీ చాలా రకాల కష్టాలు ఫేసి రియ్ లైఫ్ లోనూ ఫైటర్ గా పేరుతెచ్చుకున్న సంగతి తెలిసిందే. వరుసగా ఫ్లాపులు పడి కెరీర్ డేంజర్ జోన్లో పడినా, ఫైనాన్షియల్ గా జీరో స్టేజుకెళ్లినా ఎక్కడా డౌన్ అవ్వకుండా నిలబడ్డాడు. జీవితం ఎవ్వరినీ వదలిపెట్టదు. అందరి సరదా తీర్చేస్తది అని మోటివేషన్స్ కూడా ఇస్తుంటాడు. అలాంటి పూరీ ఇన్ని నెగిటివ్ పర్యవసానాలు, క్యూ కట్టిన కష్టాలనుంచి బైటపడి బౌన్స్ బ్యాకవుతాడేమో చూడాలి.