Project K Movie : ఆయన బాడీ బాక్సాఫీస్. ఫస్ట్ లుక్ కూడా రాకముందే రైట్స్ లో రికార్డు క్రియేట్ చేసిన ప్రభాస్

NQ Staff - January 4, 2023 / 05:08 PM IST

Project K Movie : ఆయన బాడీ బాక్సాఫీస్. ఫస్ట్ లుక్ కూడా రాకముందే రైట్స్ లో రికార్డు క్రియేట్ చేసిన ప్రభాస్

Project K Movie  : హిట్లు, ఫ్లాపులకు అతీతంగా ఫ్యాన్ బేస్ ని కంటిన్యూ చేయడం కొద్ది మంది స్టార్లకే సాధ్యం. ఆ లిస్ట్ లో ఫస్ట్ ప్లేసులో ఉంటాడు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తర్వాత నేషన్ వైడ్ గా తన రేంజ్ అండ్ క్రేజుని పదింతలు చేసుకుని అన్ని ఇండస్ట్రీల్లోనూ హార్డ్ కోర్ ఫ్యాన్సుని సంపాదించుకున్నాడు.

ఇక తెలుగులో అయితే ఫ్యాన్స్ ఎంత మందో.. డై హార్డ్ ఫ్యాన్సూ అంతే మంది. ఈ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది కాబట్టే ప్రభాస్ సినిమాల మార్కెట్ కూడా భారీగా ఉంటుంది. లేటెస్ట్ గా ప్రాజెక్ట్ కే గురించి ఓ వార్త ఈ మాటని మరోసారి నిజం చేసింది.

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్యాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా స్టార్టయిన ప్రాజెక్ట్ కే ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అమితాబ్ బచ్చన్, దీపికా పడుకునే లాంటి బడా బాలీవుడ్ స్టార్లు కూడా ప్రభాస్ తో పాటుగా నటిస్తున్నారు. అయితే ఇంతవరకూ మూవీకి సంబంధించిన ఒక్క ఫస్ట్ లుక్ గానీ, టీజర్ గానీ, ట్రైలర్ గానీ ఏవీ అఫీషియల్ గా రిలీజ్ కాలేదు.

కానీ ఈ లోపే రైట్స్ అమ్మకాలు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీ నిజాం రైట్స్ ను ఏషియన్ ఫిల్మ్స్ ఏకంగా రూ. 70 కోట్లకు సొంతం చేసుకుందట. ఇప్పుడీ వార్త టాలీవుడ్ లోనే కాదు… అన్ని భాషల ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది.

ప్యాన్ ఇండియా ప్రాజెక్టుల హవా నడుస్తున్న ఇలాంటి సమయంలో, ప్రభాస్, నాగ్ అశ్విన్ లాంటి క్రేజీ కాంబో చిత్ర హక్కుల కోసం భారీగా డిమాండ్ ఉండడంలో నో డౌట్. కానీ బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్ లాంటి వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు ప్రభాస్. కనీసం ట్రైలరో, టీజరో వచ్చినా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండియర్ ఏ రేంజులో ఉన్నాయన్న అంచనా అయినా వచ్చుండేది. ఆ అప్ డేట్సేమీ లేకపోయినా.. హీరోగా హిట్లు లేకపోయినా ఈ రేంజులో రికార్డు ధరకి ఓ ఏరియా రైట్స్ అమ్ముడుపోవడం మామూలు విషయం కాదు.

Project K Movie Rights Sales Are Creating Records

Project K Movie Rights Sales Are Creating Records

ఛత్రపతి సినిమాలో.. ఆడి బాడీ బాక్సాఫీస్ రా అని డైలాగ్ చెప్పినట్టు.. ప్రభాస్ బ్రాండ్ అండ్ క్రేజ్ చూసి ఈ రేంజులో హక్కులు అమ్ముడుపోవడం ఇక ఇప్పట్లో ఏ హీరో మూవీకి సాధ్యం కాని రికార్డేమో. నిజానికి ఓ స్టార్ హీరో, అందులోనూ ప్యాన్ ఇండియా బడా హీరో మూవీ అంటే అంచనాలుండడం, భారీ ఓపెనింగ్స్ రావడం కామనే. అది ఎవరైనా ఒప్పుకునే ఓపెన్ ఫ్యాక్టే.

కానీ మరీ రూ. 70 కోట్లంటే, ఇదే న్యూస్ ని ప్రభాస్ స్టయిల్లోనే చెప్పాలంటే.. ట్రైలర్ రిలీజయ్యాక ఎవరైనా భారీ మార్కెట్ చేసుకుంటారు. కానీ ఒక్క అప్ డేట్ లేకపోయినా కోట్లకు కొనిపించేవాడికే ఒక రేంజుంటది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us