MLA Prasanna Kumar : ఎమ్మేల్యే కామెంట్స్ పై స్పందించిన టీఎఫ్‌పీసీ.. వ్యాఖ్య‌లు వెనక్కి తీసుకోవాల‌ని డిమాండ్

MLA Prasanna Kumar : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్స్ రేట్లు తగ్గిస్తే తప్పేంటని.. తెలంగాణలో ఉండి అక్కడ సినిమాలు తీస్తున్న సినీ హీరోలు కోట్లకు కొట్లు సంపాదిస్తున్నారన్నారు. ఏపీలో ఒక ముఖ్యమంత్రి ఉన్నారనేది గుర్తుందా అని మండిపడ్డారు.

producers council deamand sorry from MLA Nallapurreddy Prasanna Kumar Reddy
producers council deamand sorry from MLA Nallapurreddy Prasanna Kumar Reddy

సినిమా హీరోలు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని.. టికెట్ రేటు తగ్గించి పేదవాడు సినిమా చూసేలా చేయడం తప్పా అని ప్రశ్నించారు. పెద్ద హీరోల సినిమా టికెట్లు వంద నుంచి వేల రూపాయాల్లో అమ్మారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోలేదని.. అందుకే ముఖ్యమంత్రి జగన్ సినిమా టికెట్ల రేట్లు తగ్గించారన్నారు. హైదరాబాద్‌లో కూర్చొని సినిమాలు తీసుకుంటూ ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఎమ్యేల్య వ్యాఖ్య‌ల‌పై తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెస్ నోట్ విడుద‌ల చేసింది. ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి గారు సినిమా నిర్మాతలనుద్దేశించి మాట్లాడుతూ ” మన సినిమా నిర్మాతలను బలిసినవాల్లు, అని ” అనడం జరిగింది. ఇది చాలా బాధాకరం, నిజ నిజాలు తెలియకుండా ఒక గౌరవ శాసన సభ్యులు ఈ విధంగా మాట్లాడటం, మొత్తం తెలుగు సినిమా పరిశ్రమను అవమానించినట్టు గా భావిస్తున్నాము,

మన తెలుగు సినిమా సక్సెస్ రేటు సుమారుగా 2 నుండి 5%మాత్రమే, మిగిలిన సినిమాలు నష్టపోవడం జరుగుతుంది, చిత్రసీమలో ఉన్న 24 క్రాఫ్ట్స్ కు పని కల్పిస్తూ, అనేక ఇబ్బందులు పడి, కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీసిన నిర్మాతలు, చివరకు ఆస్తులు అమ్ముకోవడం జరుగుతుంది. ఈ కష్ట, నష్టాల, బారిన పడి కొంతమంది నిర్మాతలు చలన చిత్ర నిర్మాతల మండలి నుండి నెలకు 3000/- రూపాయలు పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది,

దీనిని బట్టి చలన చిత్ర నిర్మాతలు ఎటువంటి దారుణ పరిస్థితులలో ఉన్నారన్న సంగతి తేట తెల్లమవుతుంది.
గౌరవ శాసన సభ్యులు శ్రీ. ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిర్మాతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేస్తూ వారి వ్యాఖలను ఉపసంహరించుకోవాలని కోరుచున్నాము.