N V Prasad : వైసీపీ నేత‌ల‌కు స్ట్రాంగ్ వార్నింగ్.. మీరే బ‌లిసి కొట్టుకుంటున్నారంటూ ఎన్ వీ ప్రసాద్ ఫైర్‌

N V Prasad : గ‌త కొద్ది రోజులుగా టాలీవుడ్‌కి, ఏపీ ప్ర‌భుత్వానికి మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. వైసీపీ నేత‌లు సినిమా వాళ్ల‌కు సంబంధించి సంచ‌ల‌న కామెంట్స్ చేస్తుండ‌గా, టాలీవుడ్ ప్ర‌ముఖులు కూడా అదే రేంజ్‌లో మండిప‌డుతున్నారు. ఇదే సమయంలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ మంత్రి పేర్ని నానితో సమావేశమయ్యారు. ఈ సమయంలో వైసీపీ సీనియర్ నేత.. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.

Producer N V Prasad comments on mla prasanna kumar
Producer N V Prasad comments on mla prasanna kumar

సినిమా హీరోలకు అసలు సీఎం జగన్ గుర్తు ఉన్నారా. రెమ్యునరేషన్ పేరుతో కోట్లకు కోట్లు సంపాదించి హైదరాబాద్ లో కూర్చుంటున్నారని వ్యాఖ్యానించారు ప్ర‌స‌న్న‌. అంతే కాకుండా సినిమా నిర్మాతలు బలిసినవాళ్లు అని అనడం జరిగింది. ఇది చాలా బాధాకరం అంటూ ఓ ప్రెస్ నోట్ వదిలారు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సినిమా పరిశ్రమ మీద, నిర్మాతల మీద చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

సినిమా వాళ్లు, నిర్మాతలు బలిసినవాళ్లంటూ కామెంట్ చేశారు. అసలు ఇండస్ట్రీ వాళ్లకు ఏపీ గుర్తుందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిర్మాతల మండలి స్పందించింది. ఆయన వ్యాఖ్యలను తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఖండించింది. ‘కోవూరు శాసన సభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి సినిమా నిర్మాతలనుద్దేశించి మాట్లాడుతూ.. మన సినిమా నిర్మాతలు బలిసినవాళ్లు అని అనడం జరిగింది. ఇది చాలా బాధాకరం. నిజనిజాలు తెలియకుండా ఒక గౌరవ శాసన సభ్యులు ఈ విధంగా మాట్లాడటం, మొత్తం తెలుగు సినిమా పరిశ్రమను అవమానించినట్టుగా భావిస్తున్నాం అని వారు అన్నారు.

మన తెలుగు సినిమా సక్సెస్ రేటు సుమారుగా రెండు నుంచి ఐదు శాతం మాత్రమే. మిగిలిన సినిమాలు నష్టపోవడం జరుగుతుంది. చిత్రసీమలో ఉన్న 24 క్రాఫ్ట్స్‌కు పని కల్పిస్తూ, అనేక ఇబ్బందులు పడి, కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీసిన నిర్మాతలు, చివరకు ఆస్తులు అమ్ముకోవడం జరుగుతుంది. ఈ కష్టనష్టాల బారిన పడి కొంత మంది నిర్మాతలు చలన చిత్ర నిర్మాతల మండలి నుంచి నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను వెనక్కి తీసుకోవాల‌ని వారు ఫైర్ అయ్యారు.

తాజాగా వైసీపీ నేతలే బలిసికొట్టుకుంటున్నారని ఫిలిమ్ చాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్ వీ ప్రసాద్ ఫైర్‌ అయ్యారు. సినిమా వాళ్ళని బలసి కొట్టుకుంటూన్నారని అనడం బాధకరమని… కొవ్వూరు లో ప్రసన్న కూమార్ గురించి అడిగితే తెలుస్తుంది అతని ఎంటి అనేది అంటూ మండిపడ్డారు. వంద అడుగులు పై నుండి రోప్ కట్టుకొని కిందకు దూకితే ఎవరు బలిసి కొట్టుకుంటూన్నారో తెలుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్ళని అమర్యాదగా మాట్లాడటం సరికాదని ఆయ‌న‌ స్పష్టం చేశారు.