Priyanka Chopra:  మూడేళ్ల తర్వాత భారత్‌ కి వచ్చిన బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌

NQ Staff - November 1, 2022 / 03:58 PM IST

Priyanka Chopra:  మూడేళ్ల తర్వాత భారత్‌ కి వచ్చిన బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌

Priyanka Chopra: బాలీవుడ్ సినిమాలతో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు దక్కించుకుంది. హాలీవుడ్ సినిమాలతో పాటు సిరీస్ ల్లో నటిస్తూ అంతర్జాతీయ స్థాయిలో స్టార్ గా నిలిచిన ప్రియాంక చోప్రా 2018లో తనకంటే పది సంవత్సరాల చిన్న వయసుకుడైన నిక్ జోనస్ ని పెళ్లి చేసుకుంది.

పెళ్లయినప్పటి నుండి కూడా లాస్ ఏంజిల్స్ లో ప్రియాంక చోప్రా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక కరోనా ఇతరత్రా కారణాల వల్ల గత మూడు సంవత్సరాలుగా ప్రియాంక చోప్రా భారత్ కి రాలేదు. ఎట్టకేలకు ముంబైలో ప్రియాంక చోప్రా అడుగు పెట్టింది.

మూడు సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చాను అన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇన్నాళ్లు ఇండియాకు తిరిగి రాకపోవడం పట్ల కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆమెకు సాదర స్వాగతం పలికారు.

ఇటీవల సరోగసి విధానం ద్వారా తల్లి అయిన ప్రియాంక చోప్రా తన బిడ్డతో సహా ఇండియాకు వచ్చినట్లుగా బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. హిందీలో ఈమె సినిమాలు చేయాలి అని భావించడం లేదని.. ఒకవేళ ఆమె నటిస్తే ఇప్పుడు కూడా వరుసగా ఆఫర్స్ ఆమె తలుపు తడతాయని బాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రియాంక చోప్రా మళ్ళీ హిందీ సినిమాల్లో నటించాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. మరి ఆమె మళ్ళీ హిందీ సినిమాల్లో నటిస్తుందేమో చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us