Priyamani : ప్రియ‌మ‌ణి అందాలకు మంత్ర‌ముగ్ధుల‌వుతున్న ఫ్యాన్స్

Priyamani : వెండితెర‌, బుల్లితెర రెండింటిని మేనేజ్ చేస్తూ త‌న అభిమానుల‌కి కావ‌ల‌సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుంది ప్రియ‌మ‌ణి. అడ‌పాద‌డాపా వెబ్ సిరీస్‌ల‌లో కూడా న‌టిస్తూ .. క్రేజీ ఆఫర్స్ పట్టేస్తూ సత్తా చాటుతుంది. మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలలో రూపొందిన ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ లో ప్రియమణి కీలక రోల్ చేశారు. ఆమె మనోజ్ భార్య రోల్ చేయడం జరిగింది. ఫస్ట్ సిరీస్లో కూడా ఈ జంట సందడి చేశారు.

Priyamani latest photo shoot
Priyamani latest photo shoot

రానా సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న విరాట పర్వం మూవీలో ప్రియమణి లేడీ నక్సల్ రోల్ చేసింది ప్రియ‌మ‌ణి. ఈ సినిమా విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన నారప్ప మూవీలో డీగ్లామర్ రోల్ లో అలరించిన ప్రియమణి, విరాటపర్వంలో మరోమారు అదే తరహా సీరియస్ రోల్ చేసింది.

Priyamani latest photo shoot
Priyamani latest photo shoot

అలాగే అజయ్ దేవ్ గణ్ హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం మైదాన్ లో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారు. ఫుట్ బాల్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా మైదాన్ తెరకెక్కుతుంది. ఇక అట్లీ-షారుక్ ఖాన్ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రియమణి నటిస్తున్న విషయం తెలిసిందే. లయన్ అనే టైటిల్ ప్రచారంలో ఉండగా, నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు.

Priyamani latest photo shoot
Priyamani latest photo shoot

గతంలో షారుక్, దీపికా పదుకొనె కాంబినేషన్ లో వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీలో ప్రియమణి ఐటమ్ సాంగ్ చేయం విశేషం. ఓ కన్నడ తెలుగు బైలింగ్వల్ మూవీతో పాటు తమిళ చిత్రాలు ఆమె చేస్తున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో కాకరేపుతుంది ప్రియమణి.

Priyamani latest photo shoot
Priyamani latest photo shoot

తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ టాప్, జీన్స్ వేసి సెగలు రేపింది. ట్రెండీ అవుట్ ఫిట్ లో సూపర్ స్టైలిష్ గా ఉన్న ప్రియమణి ఫొటోలు వైరల్ గా మారాయి. టాలీవుడ్ అగ్రహీలందరితో ఆడిపాడి స్టార్ హీరోయిన్‌గా ఫుల్ పాపులర్ అయింది ఈ కన్నడ భామ. 2003 సంవత్సరంలో ‘ఎవరే అతగాడు’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత ‘యమ దొంగ’ సినిమాతో నేమ్ ఫేమ్ కొట్టేసింది.

అలా కొన్నేళ్లపాటు వెండితెరపై హవా నడిపించి ముస్తఫా రాజ్‌ అనే వ్యక్తిని పెళ్లాడింది. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి తిరిగి ఇప్పుడిప్పుడే మళ్ళీ కెమెరా ముందుకొస్తోంది. బుల్లితెర‌పై కూడా తెగ సంద‌డి చేస్తుంది.