Prithveeraj : అవును నేను రెండో పెళ్లి చేసుకుంటున్నా.! క్లారిటీ ఇచ్చేసిన సీనియర్ నటుడు పృధ్వీ.!

NQ Staff - October 29, 2022 / 05:02 PM IST

Prithveeraj  : అవును నేను రెండో పెళ్లి చేసుకుంటున్నా.! క్లారిటీ ఇచ్చేసిన సీనియర్ నటుడు పృధ్వీ.!

Prithveeraj  : ‘పెళ్లి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు పృథ్వీ రాజ్. గతకొన్నాళ్లుగా పృధ్వీ రెండో పెళ్లి చేసుకున్నాడట.. అంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయ్.
ఆ విషయమై తాజాగా పృధ్వీ స్పందించారు. తన రెండో పెళ్లిపై వస్తున్న వార్తల్నిఖండించారాయన. ఇంకా పెళ్లి చేసుకోలేదు. కానీ, త్వరలోనే చేసుకుంటాను అని వివరణ ఇచ్చారు.

ఆమెకు 24, ఆయనకు 57..

తన మొదటి భార్యతో మనస్పర్ధలు రావడంతో గత ఆరేళ్లుగా తాను ఒంటరిగా వుంటున్నాననీ, ఒంటరితనం కుంగుబాటుకు గురి చేస్తుందనీ, ఆ బాధను తాను అనుభవించాననీ పృధ్వీ చెప్పారు.
ఆ సమయంలోనే తనకు శీతల్‌తో పరిచయం ఏర్పడిందనీ, ప్రస్తుతం శీతల్‌తో రిలేషన్‌షిప్‌లో వున్న తాను త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు.

శీతల్ వయసులో తనకన్నా చాలా చిన్నది. అయినా కానీ వయసు అనేది జస్ట్ ఏ నెంబర్. ఆమె చాలా మెచ్చూర్డ్ గాళ్. ఇద్దరి అభిరుచులు కలవడంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారట. శీతల్ కుటుంబ సభ్యులు కూడా ఈ పెళ్లికి అంగీకరించినట్లు స్వయంగా శీతల్ వెల్లడించారు.

దీంతో, పృధ్వీ రెండో పెళ్లి చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్‌కి చెక్ పెట్టేసినట్లయ్యింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us