Adipurush : ‘ఆదిపురుష్’పై అయోధ్య రామ మందిర ప్రధాన పూజారి కామెంట్స్
NQ Staff - October 6, 2022 / 08:28 AM IST

Adipurush : ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆదిపురుష్ టీజర్ విడుదల తర్వాత సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి, అంతే కాకుండా హిందూ ధర్మ పరిరక్షణకు సంబంధించిన పలువురు నాయకులు వివిధ వర్గాల వారు ఈ సినిమాలో రామాయణంను తప్పు ద్రోవ పట్టిస్తూ హిందూ సమాజంను కించపరుస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.
తాజాగా అయోధ్య రామ మందిరం ప్రధాన పూజారి ఈ సినిమా యొక్క టీజర్ పై స్పందించారు. రాముడు, హనుమంతుడు మరియు రావణాసురుడిని నిర్మాతలు తప్పుగా చిత్రీకరించారని తక్షణమే సినిమా నిషేధించాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
దేశ వ్యాప్తంగా ఇదే తరహా ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో సినిమా పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా విడుదల సమయంలో మరింతగా బ్యాన్ చేయాలంటూ ప్రచారం జరిగితే పరిస్థితి ఏంటో అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దర్శకుడు ఓమ్ రౌత్ ఈ సినిమాను రామాయణ ఇతి వృత్తంతో తీస్తున్నానని చెప్పి ఇలా చేశాడేంటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఇది రామాయణం కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ముందు ముందు ఈ సినిమా ఎలాంటి వివాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందో చూడాలి. రావణుడిని విభిన్నంగా చూపించడంతో పాటు రాముడు మరియు హనుమంతులను అవమానించే విధంగా ఈ సినిమాలో చూపించారని టాక్ ప్రధానంగా వినిపిస్తుంది. అందుకే నిషేదించాలనే డిమాండ్ వస్తోంది.