Prashant Neel : సొంత గ్రామానికి రూ.50 లక్షల విరాళం ఇచ్చిన ప్రశాంత్ నీల్.. అన్న కొడుకు మంచి పనిపై ఎమోషనల్ అయిన రఘువీరా రెడ్డి
NQ Staff - August 16, 2022 / 11:35 AM IST

Prashant Neel : కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారి దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు అందుకున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా తర్వాత చాలా మంది ప్రశాంత్ నీల్ గురించి ఆరాలు తీసారు. ఏపీకి చెందిన వ్యక్తి అని తెలిసి తెలుగు ప్రజలు గర్వపడ్డారు. ప్రశాంత్ నీల్ అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురంకి చెందిన వ్యక్తి. తన తాత, తండ్రులు అంతా ఇక్కడే ఉండేవారు.

Prashant Neil who donated Rs.50 lakhs to his own village
గర్వంగా ఉందన్న మాజీ మంత్రి…
కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి ప్రశాంత్ నీల్ కి బాబాయ్ అవుతారు. అప్పుడప్పుడు ప్రశాంత్ నీల్ తన సొంతూరికి వచ్చి వెళ్తూ ఉంటారు. ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి కొన్ని నెలల క్రితమే మరణించగా ఆయన సమాధిని ఇక్కడే నీలకంఠాపురంలో నిర్మించారు. కేజీఎఫ్ 2 విడుదల రోజున కూడా స్వగ్రామానికి వచ్చి తన తండ్రి సమాధిని సందర్శించి వెళ్లారు ప్రశాంత్ నీల్. తన బంధువులంతా నీలకంఠాపురం వాసులే కావడంతో తరచూ నీలకంఠాపురం గ్రామానికి వచ్చి వెళ్తుంటారు ప్రశాంత్ నీల్.
75 స్వాతంత్య్ర దినోత్సవం, అలాగే తన తండ్రి 75వ జయంతి కావడంతో సొంత ఊరుకి వచ్చాడు ప్రశాంత్ నీల్. సొంతూరులో ఉన్న బంధువులను పలకరించాడు, అక్కడి ఆలయాన్ని కూడా సందర్శించాడు. ఆ తర్వాత తన తండ్రి జ్ఞాపకార్థం నీలకంఠాపురంలో ఉన్న ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి విరాళంగా రూ.50 లక్షల విరాళం ప్రకటించారు ప్రశాంత్ నీల్. దీంతో నీలకంఠాపురం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయాన్ని రఘువీరా రెడ్డి సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. నాకు, నీలకంఠాపురం గ్రామం ప్రజలకు ఇది గర్వించే క్షణం. నా సోదరుడి కుమారుడు ప్రశాంత్ నీల్ 50 లక్షల విరాళం ప్రకటించారు. ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి సరిగ్గా ఇండియాకి స్వాతంత్రం వచ్చిన రోజు 1947 ఆగష్టు 15న జన్మించారని రఘువీరా పేర్కొన్నారు