Prabhas : సంప్రదాయ పంచెకట్టులో ప్రభాస్.. శ్రీవారిని దర్శించుకున్న డార్లింగ్..!
NQ Staff - June 6, 2023 / 09:29 AM IST

Prabhas : ఆదిపురుష్ మేనియా మొదలైంది. ఈరోజు సాయంత్రం తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. దాదాపు రూ.2 కోట్లు ఖర్చు పెట్టి భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ సహా మూవీ టీమ్ తిరుపతి చేరుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం ప్రభాస్ మూవీ టీమ్ తో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.
సుప్రభాత సేవలో పాల్గొన్నారు. సంప్రదాయ పంచెకట్టులో ప్రభాస్ కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. గతంలో ఎన్నడూ ప్రభాస్ ఇలా పంచెకట్టులో కనిపించలేదు. కాగా ప్రభాస్ ను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా ఎగబడ్డారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఆయన్ను కారులో ఎక్కించి పంపించారు పోలీసులు.

Prabhas Visited Tirumala Temple Along With Adipurush Film Team
అనంతరం ప్రభాస్ తాను బస చేస్తున్న గెస్ట్ హౌస్ కు వెళ్లారు. అయితే ప్రభాస్ ఉంటున్న గెస్ట్ హౌస్ వద్దకు కూడా భారీ ఎత్తున ఫ్యాన్స్ చేరుకుంటున్నారు. దాంతో గెస్ హౌస్ వద్ద కోలాహలం కనిపిస్తోంది. ఈ రోజు సాయంత్రం తిరుపతిలోని తారకరామ స్టేడియంలో ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.

Prabhas Visited Tirumala Temple Along With Adipurush Film Team
రాజమౌళి సహా చినజీయర్ స్వామి కూడా ఈ వేడుకకు హాజరవుతున్నారు. ఈ రోజు సాయంత్రమే రెండో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. జూన్ 16న సినిమా థియేటర్లలోకి రాబోతోంది. మూవీ కోసం భారీ ఎత్తున ప్రమోషన్లు చేయబోతున్నారు మూవీ మేకర్స్.