Prabhas : డార్లింగ్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. ఆయన ఇప్పుడు అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇవి రూపొందుతున్నాయి. అయితే ఇటీవల ప్రభాస్ సినిమాలతో పాటు ఆయన ప్రతి కదలికపై కూడా ఓ కన్ను వేస్తున్నారు నెటిజన్స్.

ఇది రేంజ్ అంటే..
ఏం డ్రెస్ ధరించాడు, ఏ కారులో వెళుతున్నాడు ఇలా ప్రతి దానిపై ఓ లుక్ వేస్తున్నారు. రీసెంట్‌గా `సీతారామం` ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ ఎంత సింపుల్ గా హాజరయ్యారో చూసాం. ఓ టీషర్ట్… బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ వేసుకుని వేడుకకి ముఖ్య అతిధిగా వచ్చేసారు. అటుపై పది నిమిషాలు మాట్లాడి ముగించి వెళ్లిపోయారు. కానీ డార్లింగ్ బ్లూ టీషర్ట్ మాత్రం ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది. ఈ టీషర్ట్ ఖరీదు అక్షరాల 20 వేల రూపాయలు.
దీన్ని డిజైన్ చేసింది డాల్స్ గబ్బానా (డీ అండ్ జీ). అంటే డార్లింగ్ రేంజ్ కి టీషర్ట్ ఖరీదైనదా? చవకైనదా? అన్న సందేహం వస్తుంది. దీంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వైరల్ అవుతున్నాయి. డార్లింగ్ రేంజ్ కి తగ్గ టీషర్ట్ కాదని…డిజైన్ సహా డార్లింగ్ కి సూటబుల్ అయినా ఖరీదు పరంగా అతని రేంజ్ ని టచ్ చేయలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
అయితే ప్రభాస్ స్లిమ్ లుక్లో ఎంతో అందంగా కనిపిస్తున్నాడంటూ మగువలు మనసు పారేసుకుంటున్నారు. బ్రాండెడ్ షూస్..హ్యాట్..స్పెక్స్ట్ అన్నీ డార్లింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చేసాయి. ప్రభాస్ పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.