Prabhas : ప్రభాస్‌ లుక్ పై రోజు రోజుకు పెరుగుతున్న విమర్శలు

NQ Staff - October 6, 2022 / 09:14 PM IST

Prabhas : ప్రభాస్‌ లుక్ పై రోజు రోజుకు పెరుగుతున్న విమర్శలు

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లుక్ పై గత కొన్ని రోజులుగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. మిర్చి డార్లింగ్ సినిమాల్లో ఎలాగైతే ప్రభాస్ కనిపించాడో అలాగా చూడాలని కోరుకుంటున్నాం అంటూ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరూ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.

కానీ రోజు రోజుకు ఆయన వెయిట్ పెరుగుతున్నారంటూ అభిమానులు స్వయంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఆయన అంటే దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ ఉంది, ఆ క్రేజ్ ఉపయోగించుకొని మంచి సినిమాలు చేస్తే వేల కోట్ల వసూళ్లను నమోదు చేసే స్టామినా ప్రభాస్ కి ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అలాంటి ప్రభాస్ ఫిజిక్ విషయంలో ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదా అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొందరు మాత్రం ప్రస్తుతం చేసిన సినిమాల కోసం ప్రభాస్ లుక్ మార్చుతున్నాడేమో అని ఆయన మళ్లీ డార్లింగ్, మిర్చి తరహా లుక్ లోకి వస్తాడని నమ్ముతున్నామంటూ కొందరు అభిమానులు చాలా ధీమాతో ఉన్నారు.

ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. వాటిల్లో ప్రస్తుతం ఉన్నట్లుగానే కనిపించాలి కనుక ఇప్పట్లో ఆయన సన్నబడే అవకాశం లేదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంలో ప్రభాస్ అభిమానులు కూడా నిట్టూరుస్తున్నారు, రోజు రోజుకు ప్రభాస్ లుక్ మరి చూడలేకుండా ఉందంటూ కొందరు యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆదిపురుష్‌ 3d టీజర్ రిలీజ్ కోసం మీడియా ముందుకు వచ్చిన ప్రభాస్ ఇలా కనిపించాడు. దాంతో సోషల్ మీడియాలో మళ్లీ ఆయన ఫోటోలు వైరల్ అయి విమర్శలు ఎదుర్కొంటున్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us