Prabhas : త్వరలో తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటా.. మొత్తానికి చెప్పేసిన ప్రభాస్..!
NQ Staff - June 7, 2023 / 09:10 AM IST

Prabhas: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఒకే ఒక్క అంశం.. ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఉన్న ఫ్యాన్స్.. కొన్ని వేల సార్లు అడిగినా సమాధానం లేని ప్రశ్నకు తాజాగా ప్రభాస్ సమాధానం ఇచ్చాడు. అదే మన డార్లింగ్ ప్రభాస్ పెండ్లి. కెరీర్ పరంగా ఎవరూ అందుకోలేనంత ఎత్తులో ఉన్నాడు ప్రభాస్.
తెలుగు నాట మొదలైన ఆయన ప్రస్థానం ఇప్పుడు ప్రపంచ స్థాయిని తాకుతోంది. ఈ స్థాయికి ఎదిగిన తీరును చూసి ఆయన ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. కానీ ఒక విషయంలో మాత్రం అసంతృప్తి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఉన్న ప్రభాస్ ఓ ఇంటివాడు అయితే చూడాలని ఎంతో మంది ఆశపడుతున్నారు.
నిన్న సాయంత్రం తిరుపతిలో జరిగిన ఆదిపురుష్ ఈవెంట్ లో ప్రభాస్ పెళ్లిపై గుడ్ న్యూస్ చెప్పాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్స్ పెళ్లి ఎప్పుడు అని అరిచారు. దానికి ప్రభాస్ స్పందిస్తూ.. పెళ్లా త్వరలోనే తిరుపతిలోనే చేసుకుంటా అంటూ చెప్పాడు. దాంతో ఫ్యాన్స్ సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి.
దీన్ని బట్టి చూస్తుంటే ప్రభాస్ కచ్చితంగా పెండ్లి చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ ఎప్పుడు అనేది మాత్రం తెలియదు. పైగా ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడల్లా త్వరలోనే అంటూ ప్రభాస్ చెప్పడం కూడా కామన్ అయిపోయింది మరి ఈ సారైనా దాన్ని నిజం చేస్తాడా లేక ఎప్పటిలాగే వెయిట్ చేయిస్తాడా అనేది చూడాలి.