Prabhas : బ్రేకింగ్.. మళ్లీ అనారోగ్యానికి గురైన ప్రభాస్.. ట్రీట్ మెంట్ కోసం విదేశాలకు..!
NQ Staff - March 8, 2023 / 09:29 AM IST

Prabhas : అవును.. మీరు విన్నది నిజమే.. ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. బాలీవుడ్ మీడియా ఇప్పుడు ఇదే విషయాన్ని కోడై కూస్తోంది. ప్రభాస్ ఆరోగ్యం బాగా లేదని తెలుస్తోంది. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టులు ఆయన్ను మరో లెవల్ కు తీసుకెళ్తాయని అంతా అంటున్నారు.
ప్రస్తుతం బడా సినిమాల్లోనే నటిస్తున్న ప్రభాస్.. వరుస షూటింగులతో చాలా బిజీగా ఉంటున్నాడు. ఆయన నటించిన ఆదిపురుష్ రిలీజ్ కు రెడీగా ఉంది. కాగా ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించిందని అంటున్నారు. ఆరోగ్యం బాగో లేకపోవడంతో ఆయన చేస్తున్న సినిమా షూటింగులకు బ్రేక్ వేశాడంట.
విదేశాలకు పయనం..
నిన్న అర్థరాత్రి నుంచి ఆయన ఆరోగ్యం బాగా లేదని.. ఈ కారణంగానే ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయన విదేశాలకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. సన్నిహిత వర్గాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి.
మరి ఇది నిజమేనా అనే సందేహాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే మన టాలీవుడ్ మీడియా దీనిపై ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. కేవలం బాలీవుడ్ మీడియా మాత్రమే దీన్ని హైలెట్ చేస్తోంది. ఇదంతా నిజమేనా.. లేదంటే ప్రభాస్ మీద బాలీవుడ్ కుట్రనా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.