Salaar Movie : భయపెట్టిస్తున్న సెంటిమెంట్.. సలార్ విషయంలో భయపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్
NQ Staff - August 19, 2022 / 01:45 PM IST

Salaar Movie : సినిమా స్టార్స్‌కి కూడా కొన్ని సెంటిమెంట్స్ తప్పక ఉంటాయి. ఆ రోజు సినిమా ముహూర్తం పెడితే హిట్ అవుతుందని, పలానా రోజు రిలీజ్ చేస్తే చిత్రం సక్సెస్ అవుతుందని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అయితే కొన్ని నెలలో ఆయా హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఫ్లాప్ కావడం పక్కా అనే సెంటిమెంట్ కూడా గత చరిత్రని బట్టి చెబుతుంటారు.
కొత్త సెంటిమెంట్..
ప్రస్తుతం సలార్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్‌ని ఓ సెంటిమెంట్ తెగ భయపెడుతుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు ప్రభాస్. సాహో రాధేశ్యామ్ చిత్రాల తర్వాత ప్రభాస్ మరో రెండు సినిమాల షూటింగ్స్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరో రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి. షూటింగ్ జరుపుకుటోన్న సినిమాల విషయానికి వస్తే సలార్ , ప్రాజెక్ట్ K .. రీసెంట్‌గా రిలీజ్ డేట్స్ వచ్చేశాయి.

Prabhas Fans Worried About Release Date of Salaar Movie
ఈ రెండు కాకుండా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆది పురుష్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్‌తో బిజీగా ఉంది. అది వచ్చే ఏడాది సంక్రాంతికి రానుంది. సలార్. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. అలాగే నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో రూపొందుతోన్న ప్రాజెక్ట్ K సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 18న రిలీజ్ కానుంది. ప్రభాస్ ఫ్యాన్స్ తమ డార్లింగ్ సినిమాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అంతా బాగానే ఉంది కానీ.. ప్రభాస్ ఫ్యాన్స్ ఓ విషయంలో చాలా టెన్షన్ పడుతున్నారట. అది కూడా సలార్ విషయంలో. ఎందుకు.. ప్రభాస్‌లాంటి హీరో, ప్రశాంత్ నీల్ డైరెక్టర్, హోంబలే ఫిలింస్ వంటి నిర్మాతలుంటే టెన్షన్ ఎందుకబ్బా? అనే సందేహం రాక మానదు. ప్రభాస్ నటించిన రెబల్ సెప్టెంబర్ 28న రిలీజై భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు సలార్ కూడా అదే సెంటిమెంట్‌తో ఫ్లాప్ అవుతుందా అనే సందేహం అభిమానులలో కలుగుతుంది. మరి ఈ సెంటిమెంట్ ప్రభాస్ బ్రేక్ చేస్తాడా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు.