Prabhas : ప్రభాస్ సైలెంటుగా చక్కబెట్టేస్తున్నాడహో.!
NQ Staff - August 12, 2022 / 10:24 PM IST

Prabhas : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, ఇప్పుడేం చేస్తున్నాడు.? అంటే, ఆయన చేతిలో ‘ఆదిపురుష్’ సినిమా వుంది. ‘సలార్’ సినిమా కూడా వుంది. అంతేనా, ‘ప్రాజెక్ట్ కె’ సినిమా కూడా చేస్తున్నాడు. వీటిల్లో ఏ సినిమా ఎప్పుడొస్తుంది.? అన్నదానిపై కొంత అయోమయం వుంది.
అసలు ప్రభాస్ ఏ సినిమా ఎంతవరకు చేస్తున్నట్లు.? అన్నదానిపైనా భిన్న వాదనలు ఎప్పటికప్పుడు తెరపైకొస్తున్నాయి. దేనికదే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు.. ఔను మరి ప్రభాస్ అంటే పాన్ ఇండియా రెబల్ స్టార్ కదా.! సినిమా సినిమాకీ గ్యాప్ వుండకూడదని అభిమానులు కోరుకోవడాన్నీ తప్పు పట్టలేం.
ఇంతకీ, ప్రభాస్ సినిమాలెక్కడిదాకా వచ్చాయ్.?

Prabhas Fans New Zeal On Shooting of Project K Movie
‘ఆది పురుష్’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. ‘ప్రాజెక్ట కె’ కూడా అంతేనట. 50 శాతం మేర సినిమా షూటింగ్ పూర్తయిపోయిందంటూ నిర్మాత అశ్వనీదత్ ‘ప్రాజెక్ట్ కె’ గురించి తాజాగా చెప్పడం ప్రభాస్ అభిమానుల్లో కొత్త జోష్ నింపుతోంది.
అటు ‘ఆది పురుష్’ కంప్లీట్ అయిపోతే, ‘ప్రాజెక్ట్ కె’ కూడా పూర్తయిపోతే, ‘సలార్’ కూడా ఓ కొలిక్కి వచ్చేస్తే.. పెద్దగా గ్యాప్ తీసుకోకుండా మూడు సినిమాల్నీ ప్రేక్షకుల ముందుకు ప్రభాస్ తీసుకొచ్చేస్తాడని అనుకోవచ్చు. అయితే, ఈ మూడు సినిమాలకీ వీఎఫ్ఎక్స్ అత్యంత కీలకం. అక్కడే సమయం ఎక్కువ పట్టొచ్చు. సో, ప్రభాస్ తదుపరి సినిమా.. ఇప్పట్లో, ఒకింత జరిగే పని కాదేమో.!